పిటీషన్ కొట్టేసిన కోర్టు…ఇప్పటికైనా బుద్ధి వస్తుందా ?

ప్రభుత్వం తీరు చూస్తుంటే అనుమానంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డిపై  హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారించటాన్ని చాలెంజ్ చేస్తు రాష్ట్రప్రభుత్వ వేసిన పిటీషన్ ను హై కోర్టు కొట్టేసింది. మూడు రోజుల్లో రాష్ట్రప్రభుత్వం వేసిన రెండు పిటీషన్లనూ హై కోర్టు కొట్టేయటం గమనార్హం. ఎన్ఐఏ విచారణను అడ్డుకుంటు మూడు రోజుల క్రితమే రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన హౌజ్ మోషన్ ను కొట్టేసింది. తాజాగా సోమవారం మళ్ళీ అదే పిటీషన్ ను హై కోర్టులో మళ్ళీ రాష్ట్రప్రభుత్వం చాలెంజ్ చేసింది. ఇపుడు కూడా ఆ పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. జగన్ హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణకు రాష్ట్రప్రభుత్వం సహకరించాల్సిందేనని, సంబంధించిన వివరాలన్నింటినీ స్ధానిక పోలీసులు ఎన్ఐఏకి అప్పగించాల్సిందేనంటూ గట్టిగా తలంటిపోసింది.

జగన్ హత్యాయత్నం ఘటనలో మొది నుండి  చంద్రబాబునాయుడు తప్పులు చేస్తూనే ఉన్నారు. అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేస్తునే ఉన్నారు. ఘటన జరగ్గానే దాడి మొత్తాన్ని  డ్రామాగా కొట్టి పారేశారు. రేపటి ఎన్నికల్లో సింపతీ కోసమని, ఓట్లు రాల్చుకోవటం కోసం జగనే తనపై తన అభిమానితో దాడి చేయించుకున్నాడని తేల్చేశారు. దాంతో విషయం కాస్త పెద్ద వివాదంగా మారింది. ఘటనపై చంద్రబాబు ఓవర్ యాక్షన్ చేయకపోతే వైసిపి కూడా ఇంత సీరియస్ గా తీసుకునేది కాదేమో ?

ఎప్పుడైతే హత్యాయత్నం మొత్తం  డ్రామానే అని చంద్రబాబు చెప్పారో వెంటనే వైసిపి కూడా చంద్రబాబుపై ఎదురుదాడి మొదలుపెట్టింది. హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రదారి చంద్రబాబే అని, చంద్రబాబే మొదటి ముద్దాయిగా జగన్ అండ్ కో ఆరోపణలు మొదలుపెట్టారు. అందుకనే కుట్రకోణం బయటకు రావాలంటే థర్డ్ పార్టీ విచారణ చేయించాల్సిందేనంటూ కోర్టులో కేసు వేశారు. అప్పటి నుండి చంద్రబాబు అండ్ కోలో టెన్షన్ మొదలైంది. కోర్టు ద్వారానే ఎన్ఐఏ విచారణను అడ్డుకోవాలని చేసిన అన్నీ ప్రయత్నాలు కోర్టులో వీగిపోయాయి. దాంతో చంద్రబాబు ఇఫుడేం చేస్తారో చూడాలి.