ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి దిశగా పరిగెత్తించేందుకు జగన్ ప్రభుత్వం వరుసగా పలు పథకాలను ప్రవేశపెడుతుంది. ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని న్యాయ శాఖ, పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును 2021 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాగా, ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందజేయాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.