బ్రేకింగ్ న్యూస్.. కూటమి పార్టీలకు ఝలకిచ్చిన కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూటమిలోని పార్టీలకు మరో ఝలక్ ఇచ్చింది. 94 స్థానాల్లో పోటి చేస్తామని  ప్రకటించిన కాంగ్రెస్ 99 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేసింది. ఈ విషయం పై కూటమి పార్టీలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 94 స్థానాల్లో పోటి చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో అభ్యర్దులకు బిఫారాలు అందజేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు కావడంతో సోమవారం ఉదయం 5 గురు అభ్యర్ధులకు కాంగ్రెస్ బిఫాంలు అందజేసింది. కాంగ్రెస్ పార్టీ  బి ఫాంలు అందజేసిన 5 స్థానాలివే

హూజూరాబాద్ – కౌశిక్ రెడ్డి

దుబ్బాక- నాగేశ్వర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం- మల్ రెడ్డి రంగారెడ్డి

పటాన్ చెర్వు- శ్రీనివాస్ గౌడ్

వరంగల్ ఈస్ట్ – గాయత్రి రవి

వీరందరికి సోమవారం ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి బిఫాంలు అందజేసినట్టు తెలుస్తోంది. టిడిపికి ముందుగా అనుకన్నట్టు 14 సీట్లు కాకుండా 13 సీట్లే కేటాయించింది. టిడిపికి ఇవ్వడానికి వీలు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీ ఫారాలు అందజేసింది. ఇబ్రహీంపట్నం సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. అక్కడి నుంచి సామ రంగారెడ్డికి టికెట్ కేటాయించారు. రంగారెడ్డి ఎల్ బీ నగర్ సీటు కోరినా అది సుధీర్ రెడ్డికి కేటాయించడంతో సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం కేటాయించారు.

ఇక్కడ పోటి చేయడం ఇష్టం లేదని సామరంగారెడ్డి చంద్రబాబును కలిసి విషయం చెప్పారు. మల్ రెడ్డి రంగారెడ్డి కూడా సామ రంగారెడ్డికి మద్దతిస్తానని ప్రకటించారు. అప్పుడు సామ రంగారెడ్డి పోటి చేస్తానని ప్రకటించారు. అనూహ్యంగా మల్ రెడ్డి రంగారెడ్డి తానే కాంగ్రెస్ నుంచి పోటి చేస్తానని బీ ఫాం వస్తుందని కూడా ప్రకటించాడు. ఆయన ప్రకటించినట్లుగానే కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డికి బీ ఫాం ఇచ్చింది.

పఠాన్ చెర్వు కూడా టిడిపి నుంచి నందీశ్వర్ గౌడ్ కు కేటాయిస్తారని అంతా అనుకున్నారు. టిడిపి కూడా ప్రకటించే ఒక్క స్థానం అదేనని చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ కు టికెటిచ్చారు. వరంగల్ ఈస్ట్ లో టిజెఎస్ తన అభ్యర్ధిని ప్రకటించింది. అక్కడ కూడా గాయత్రి రవికి కాంగ్రెస్ టికెట్ కేటాయించారు.

94 స్థానాల్లో పోటి చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ 99 స్థానాల్లో అభ్యర్ధులకు బీ ఫాంలు అందజేయడం పై ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని వారు కాంగ్రెస్ ను నిలదీసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో చర్చించిన విధంగా సీట్ల కేటాయింపు జరగలేదని వారు మండిపడ్డారు. కూటమిలో కొట్లాటలు టిఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉండటంతో నేతలంతా అంతర్గంతంగానే చర్చలు జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.

 టిడిపి మాత్రం తమకు సీట్లు ముఖ్యం కాదని కేసీఆర్ ఓటమే ముఖ్యమని ప్రకటించింది. కాంగ్రెస్ ఇస్తే మరో స్థానంలో పోటి చేస్తామని లేని పక్షంలో 13 స్థానాల్లో పోటి చేస్తామని ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ బిఫాంలు అందజేసిన 99 స్థానాలివే

సిర్పూర్ : పాల్వాయి హరీశ్ బాబు
చెన్నూరు : వెంకటేశ్ నేత బోర్లకుంట
మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ సాగర్ రావు
ఆసిఫాబాద్ : ఆత్రం సక్కు
ఆదిలాబాద్ : సుజాత గండ్రత్
నిర్మల్ : అల్లేటి మహేశ్వర్ రెడ్డి
ముదోల్ : రామారావు పటేల్ పవార్
ఆర్మూర్ : ఆకుల లలిత
బోధన్ : పి. సుదర్శన్ రెడ్డి
జుక్కల్ : ఎస్. గంగారం
బాన్సువాడ : కాసుల బాలరాజు
కామారెడ్డి : షబ్బీర్ అలీ
జగిత్యాల : జీవన్ రెడ్డి
రామగుండం : ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్
మంథని : శ్రీధర్ బాబు దుద్దిళ్ల 
పెద్దపల్లి : సి. విజయ రమణారావు
కరీంనగర్ : పొన్నం ప్రభాకర్
చొప్పదండి : మేడిపల్లి సత్యం
వేములవాడ : ఆది శ్రీనివాస్
మానకొండూరు : ఆరేపల్లి మోహన్
ఆందోల్ : దామోదర రాజనర్సింహ
నర్సాపూర్ : సునీతా లక్ష్మారెడ్డి
జహీరాబాద్ : గీతారెడ్డి
సంగారెడ్డి : జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
గజ్వేల్ : వంటేరు ప్రతాప్ రెడ్డి
కుత్బుల్లాపూర్ : కూన శ్రీశైలం గౌడ్
మహేశ్వరం : పి. సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల : కేఎస్ రత్నం
పరిగి : రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ : గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు : పైలట్ రోహిత్ రెడ్డి
ముషీరాబాద్ : ఎం. అనిల్ కుమార్ యాదవ్
నాంపల్లి : ఫిరోజ్ ఖాన్
గోషామహాల్ : ముకేశ్ గౌడ్
చార్మినార్ : మహ్మద్ గౌస్
చాంద్రాయణగుట్ట : ఇసా బినోబాయిద్ మిస్రీ
సికింద్రాబాబ్ కంటోన్మెంట్ : సర్వే సత్యనారాయణ
కొడంగల్ : రేవంత్ రెడ్డి
జడ్చర్ల : మల్లు రవి
వనపర్తి : జి. చిన్నారెడ్డి
గద్వాల : డీ.కే అరుణ
అలంపూర్ : సంపత్ కుమార్
నాగర్ కర్నూలు : నాగం జనార్దన్ రెడ్డి
అచ్చంపేట : సీ.హెచ్ వంశీకృష్ణ
కల్వకుర్తి : వంశీ చంద్‌రెడ్డి
నాగార్జున సాగర్ : జానారెడ్డి
హుజుర్ నగర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ : పద్మావతి రెడ్డి
సూర్యాపేట : ఆర్. దామోదర్ రెడ్డి
నల్గొండ : కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
మునుగోడు : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి : కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నకిరేకల్ : చిరుముర్తి లింగయ్య
ఆలేరు : భిక్షమయ్య గౌడ్
స్టేషన్ ఘన్‌పూర్ : సింగపూర్ ఇందిర
పాలకుర్తి : జంగా రాఘవరెడ్డి
డోర్నకల్:  జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్ : పోరిక బలరాం నాయక్
నర్సంపేట : దొంతి మాధవ్ రెడ్డి
పరకాల : కొండా సురేఖ
ములుగు : డి. అనసూయ అలియాస్ సీతక్క
పినపాక : రేగ కాంతారావు
మధిర : మల్లు భట్టి విక్రమార్క
కొత్తగూడెం : వనమా వెంకటేశ్వరరావు
భద్రాచలం : పోడెం వీరయ్య

ఖానాపూర్- రమేష్ రాథోడ్

మేడ్చల్ – కిచ్చెన గారి లక్ష్మారెడ్డి

ఖైరతాబాద్- దాసోజు శ్రావణ్

పాలేరు- ఉపేందర్ రెడ్డి

సిరిసిల్ల- మహేందర్ రెడ్డి

జూబ్లీహిల్స్- విష్ణు వర్ధన్ రెడ్డి

భూపాలపల్లి- గండ్ర వెంకటరమణారెడ్డి

షాద్ నగర్- ప్రతాప్ రెడ్డి

ధర్మపురి- లక్ష్మణ్

ఎల్లారెడ్డి  -జాజుల సురేందర్

జనగామ- పొన్నాల లక్ష్మయ్య

బోథ్- సోయం బాపూరావు

దేవరకొండ- బాలూ నాయక్

ఎల్బీ నగర్- సుధీర్ రెడ్డి

తుంగతుర్తి- అద్దంకి దయాకర్

బాల్కొండ- అనిల్ కుమార్

కార్వాన్- ఉస్మాన్ బిన్

యాకత్ పురా- రాజేందర్ రాజు

నిజామాబాద్ రూరల్- రేకుల భూపతి రెడ్డి

నిజామాబాద్ అర్బన్-తాహేర్ బిన్

బహదూర్ పురా- కాలేం బాబా

కొల్లాపూర్- హర్ష వర్ధన్ రెడ్డి

ఇల్లెందు- బానోతు హరిప్రియ నాయక్   

 సికింద్రాబాద్: కాసాని జ్ఞానేశ్వర్

 కోరుట్ల: జువ్వాడి నర్సింగరావు

  నారాయణఖేడ్: సురేష్ షెట్కార్

   నారాయణపేట: వామనగారి కృష్ణ

   దేవరకద్ర: పవన్ కుమార్ రెడ్డి

   మిర్యాలగూడ: ఆర్. కృష్ణయ్య