మహా కూటమి ఓటమిపై కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో మహా కూటమి ఓటమి ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

ఆయనేమన్నారో చదవండి.

మహాకూటమి వద్దని ఎన్నికల ముందే చెప్పాను.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు వద్దని సమీక్ష సమావేశంలో చెప్పాను. 

సీట్లే పంచుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని కేసీఆర్ ప్రజాలోకి తీసుకువేళ్ళారు. 

కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 40 నుండి 45 స్థానాలు గెలిచే వాళ్ళం. 

నాలాంటి వాళ్ళ ఓటమికి పొత్తలే కారణం. 

పార్లమెంట్ ఎన్నికలోపొత్తులు లేకుండా పోటీ చేస్తే 7 నుండి 8 స్థానాలు తప్పకుండా గెలుస్తాం. 

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ వస్తుందో లేదో అని ప్రజలు అయోమయానికి గురైనారు.

నల్గొండ అర్బన్ స్థానములో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అని నన్ను ప్రశ్నించారు. 

కేసీఆర్ నా నియోజకవర్గంలో రెండు సార్లు ప్రచారం చేశారు. 

నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. 

కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మారు. 

ప్రజాకుటమి గెలిస్తే చంద్రబాబు పాలన సాగిస్తారని టి ఆర్ ఎస్ ప్రచారం చేసింది. 

హైకమాండ్ టికెట్ ఇస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా. విజయం సాధిస్తా.