షాకింగ్ : ఆంధ్రా సచివాలయంలో ఇదేం పని ? (వీడియో)

సచివాలయం అంటే పాలనకు గుండెకాయ. అక్కడ ఉద్యోగులు, అధికారులు, రక్షణ బలగాలు ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. పాలన సాగేదందతా సచివాలయం నుంచే. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సచివాలయం ఉంది. ఈ సచివాలయంలో కొన్ని బ్లాకులు తెలంగాణకు , మరికొన్ని బ్లాకులు ఆంధ్రా కు కేటాయించారు. కానీ ఎపి సర్కారు అమరావతికి షిఫ్ట్ అయి చాలారోజులైంది. కాకపోతే ఎల్ బ్లాక్, జె, కె బ్లాక్, హెచ్ బ్లాక్ ఇంకా  ఎపి సర్కారు ఆధీనంలోనే ఉన్నాయి.

అయితే నిన్న ఆదివారం కావడంతో సచివాలయంలోని ఎల్ బ్లాక్ పక్కన ఉన్న మీడియా పాయింట్ సమీపంలో కండోమ్ పాకెట్స్ కలకలం రేపుతున్నాయి. అసలే ఆంధ్రా సచివాలయ బ్లాక్ లు జనాలు, అధికారులు, సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. దీంతో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు తాజా ఉదంతం తేటతెల్లం చేసింది. సచివాలయంలోని ఈసి ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం సచివాలయ వర్గాల్లో కలకలం రేపుతున్నది. 

సచివాలయంలో అడుగడుగునా నిఘా ఉంటుంది. ప్రతి ఇంచు భూమి కూడా సిసి కెమెరాల కనుసన్నల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఆదివారం పూట కండోమ్స్ ఎలా అక్కడకు వచ్చాయన్న చర్చ జరుగుతున్నది. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయంలో గర్భనిరోధక నిరోద్ పాకెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై రక్షణ సిబ్బంది ఆరా తీస్తున్నారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నగరంలోని గుండె కా లాంటి ప్రధాన సచివాలయంలో పేరుకుపోయిన చెత్తలో మూడ్స్ నిరోద్ పాకెట్స్ వాడి పడేసినవి ఉండటం ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదిన్నరగా ఏపీ సచివాలయం బ్లాక్ ల్లో పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాలు లేకపోవడం, ఏపీకి సంబంధించిన అన్ని విభాగాలు అమరావతికి తరలిపోవడం తో ఎల్, జే, కే, హెచ్ నార్త్ బ్లాక్ లో బోసి పోయి ఉన్నాయి.

అంతేకాదు ఎవరు ఇక్కడికి రాక కాళీగా పడి ఉన్నాయి. దీంతో ఇక్కడ ఏవో అసంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఉద్యోగులు అంటున్నారు. వీడియో కింద ఉంది.