AP: ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంతో మంది వైకాపాకు చెందిన కొంతమంది కీలక నేతలు కూటమి పార్టీలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కూటమి పార్టీలోకి వెళ్లినటువంటి కొంతమంది నాయకులు ప్రస్తుతం మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను కొనసాగుతున్నారు. అయితే ఇలా కూటమి పార్టీలోకి వెళ్లిన కొంతమంది ఇంకా వైకాపా నాయకులతో చాలా చనువుగా వ్యవహరిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కూటమి మంత్రి తాజాగా వైకాపా సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఏకంగా పాదాభివందనం చేశారని తెలుస్తోంది. ఈయన వైకాపా నుంచి కూటమి పార్టీలోకి వెళ్లారు అయితే విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి ఎంతో మంచి రాజకీయ పలుకుబడి ఉంది ఈ క్రమంలోనే ఆయనని తన గురువుగా భావించిన కూటమి మంత్రి ఇప్పటికీ ఆయన విధివిధానాలను అనుసరిస్తూ ఉన్నారని చెప్పాలి.
ఈ క్రమంలోనే కూటమి ఎమ్మెల్యేలు మంత్రుల ముందు ఆయన ఏకంగా తాను గురువుగా భావించే బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేయడం పట్ల కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మంత్రి అవలంబించిన విధాన విధానాలు పై ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు.. సాధారణ చిన్న కార్యకర్తలయితే క్రమశిక్షణ చర్యలని ఈ పాటికే వారిపై చర్యలు ఉండేవా..అంటూ ప్రస్తుతం విజయనగరంలో ఇదే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.