‘సీఎం పవన్ కళ్యాణ్’.! టీడీపీకి గుండె పోటు.!

తారక రత్నకి గుండె పోటు వ్యవహారం కాదిక్కడ మనం చర్చించుకుంటుంది. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న ఆలోచన తెలుగుదేశం పార్టీని గుండె పోటులా ఓ కుదుపు కుదిపేస్తోంది.

టీడీపీ – జనసేన పొత్తు విషయమై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్యా పొత్తు కుదిరినా చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నది టీడీపీ వాదన.

కాగా, ‘ఏ పార్టీ మాతో కలిసినాసరే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి..’ అని జనసేన ముఖ్య నేత, మెగా బ్రదర్ నాగబాబు పలు సందర్భాల్లో చెప్పారు. ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని పవన్ చెప్పిన దాంట్లో అర్థం, తానే నాయకత్వం వహిస్తాను విపక్షానికి.. అని అంటున్నారు జనసేన నేతలు.

కాగా, టీడీపీ అనుకూల మీడియా కూడా, పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అయితేనే ఫలితాలు మెరుగ్గా వుంటాయని విపక్ష కూటమి విషయమై విశ్లేషణలు చేస్తోంది. టీడీపీ అనుకూల మీడియా సంస్థల అధినేతలతో ఇటీవల చంద్రబాబు భేటీ సందర్భంగా ‘పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి’ అనే అంశం చర్చకు రాగా, అన్యమనస్కంగానే చంద్రబాబు దానికి సుముఖత చెప్పక తప్పలేదట.

ఇదిలా వుంటే, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే, టీడీపీని కలుపుకుపోవడానికి మాకేమీ ఇబ్బంది లేదంటూ కొన్నాళ్ళ క్రితం బీజేపీ కూడా వ్యాఖ్యానించింది. పరిస్థితులన్నీ పవన్ కళ్యాణే సీఎం అభ్యర్థి అంటోంటే.. టీడీపీలో మాత్రం తీవ్రస్థాయి హార్ట్ స్ట్రోక్స్ కనిపిస్తున్నాయ్. కానీ, తప్పదు.. టీడీపీ 2024 ఎన్నికల గండం గట్టెక్కాలంటే పవన్ కళ్యాణ్‌కి జై కొట్టక తప్పదు.