ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయాలకు సంబంధించి ఒకింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నా జగన్ మాత్రం స్పందించడం లేదు. జగన్, కేసీఆర్ మధ్య మంచి స్నేహం ఉందనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జగన్ మోదీ సర్కార్ కు సపోర్ట్ చేస్తుండటంతో జగన్, కేసీఆర్ మధ్య దూరం పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో వైఎస్సార్టీపీ పార్టీ గురించి కూడా జగన్ స్పందించడం లేదు. షర్మిల పార్టీ గురించి ఏ ఒక్క కామెంట్ చేసినా ఆ కామెంట్ తన పొలిటికల్ కెరీర్ పై ప్రభావం చూపుతుందని జగన్ భావిస్తున్నారు. షర్మిలకు తాను మద్దతు ఇస్తే ఇతర పార్టీలు తనను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీల వల్ల తనకు ఏదైనా సమస్య వచ్చేవరకు స్పందించకూడదని జగన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
జగన్ దృష్టి ప్రస్తుతం జనసేన, టీడీపీలపై ఉంది. ఈ రెండు పార్టీల వల్ల తన రాజకీయ భవిష్యత్తుకు సమస్యలు వస్తున్నాయని జగన్ భావిస్తున్నారు. మరోవైపు జగన్ 2024 ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారని సమయాన్ని బట్టి జగన్ వ్యూహాలలో మార్పులు ఉండనున్నాయని సమాచారం. పార్టీని బలోపేతం చేయడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఆయన భావిస్తున్నారు.
అదే సమయంలో ప్రజల దృష్టిలో పార్టీపై వ్యతిరేకత వచ్చే ఏ అవకాశం ఉన్నా ఆ సమస్యలకు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే పార్టీకి మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారని సమాచారం. గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జగన్ ప్రణాళికలు ఉండనున్నాయని బోగట్టా.