ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా రెండున్నర లక్షల కంటే ఎక్కువ మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. మూడున్నరేళ్ల నుంచి వాలంటీర్ల వేతనం రూపాయి కూడా పెరగలేదు. కొంతమంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా మరి కొందరు మాత్రం ఈ ఉద్యోగమే కెరీర్ గా కొనసాగిస్తున్నారు. ఖర్చులు పెరుగుతున్నా సొంతూరిలో ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు ఈ ఉద్యోగం బెస్ట్ ఆప్షన్ అవుతోంది.
అయితే గ్రామ, వార్డు వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలని జగన్ సర్కార్ భావిస్తోందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ సర్కార్ త్వరలో వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించడం ద్వారా వాళ్ల ఉద్యోగాలకు ఢోకా లేకుండా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విధంగా చేయడం ద్వారా ప్రభుత్వం మారినా వాలంటీలర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగవని వైసీపీ ఫీలవుతున్నట్టు సమాచారం.
జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే మాత్రం వాలంటీర్ల ఆనందానికి అవధులు ఉండవు. 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని అమలు చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ నిర్ణయం అమలుతో పాటు జగన్ సర్కార్ వేతనాలు పెంచితే మాత్రం మరో పదేళ్ల పాటు ఏపీలో వైసీపీ హవా కొనసాగుతుందని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గ్రామ, వార్డ్ వాలంటీర్లకు బెనిఫిట్ కలిగేలా జగన్ నిర్ణయం తీసుకుంటే సాధారణ ప్రజల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ సర్కార్ పొరపాట్లు జరగకుండా అడుగులు వేయాల్సి ఉంది. వాలంటీర్ల విషయంలో జగన్ సర్కార్ ప్రణాళికలు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.