విశాఖలో అప్పటినుంచి సీఎం జగన్ పాలన.. అలాంటి సమస్యలు రావు కదా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేశారు. అమరావతి రైతులు ఈ నెల 12వ తేదీన అమరావతి నుంచి పాదయాత్రను మొదలుపెట్టి నవంబర్ నెల 11వ తేదీకి అరసవెల్లిలో యాత్రను ముగించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్ర ముగింపు సమయానికి ఏపీలో విశాఖ రాజధానిగా పాలన జరగనుంది. వైసీపీ మంత్రులు గత కొన్నిరోజులుగా విశాఖ పరిపాలన రాజధాని అని చెబుతుండగా వాళ్లు చెప్పిన మాటలే నిజం కానున్నాయని సమాచారం.

త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఆ సమయంలో పరిపాలన రాజధానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం విశాఖ నుంచి జగన్ పాలన మొదలవుతుందని బోగట్టా. మూడు రాజధానుల నిర్ణయం అమలు ఆలస్యం విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

విశాఖలోని రుషికొండ దగ్గరలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు కానుందని ఈ నిర్ణయం అమలు విషయంలో దాదాపుగా ఎలాంటి మార్పు లేదని బోగట్టా. విశాఖలో రైతులు ఎంట్రీ ఇచ్చే సమయానికి విశాఖ నుంచి పాలన సాగించడం ద్వారా ఆయన వాళ్లు ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టినా కోర్టు సమస్యలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.

జగన్ సరైన దిశగానే అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలంటే జగన్ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. జగన్ నిర్ణయాలే ఏపీ భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.