38 మందికి చివరి ఛాన్స్ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆయన ప్లాన్ ఇదేనా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ 38 మందికి పనితీరు మార్చుకోవాలని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇలా సూచనలు అందుకున్న వాళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు పార్టీ సమన్వయకర్తలు కూడా ఉన్నారని సమాచారం అందుతోంది. మంత్రులలో గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేందర్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, పినిపె విశ్వరూప్, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు ఈ జాబితాలో ఉన్నారు.

ఎమ్మెల్యేల విషయానికి వస్తే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, వై సాయిప్రసాద్ రెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మరి కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా ఇందుకు సంబంధించిన వార్నింగ్ లు వెళ్లాయని సమాచారం అందుతుండటం గమనార్హం.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పనితీరును మార్చుకోని పక్షంలో వాళ్లకు కచ్చితంగా భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. జగన్ నుంచి వార్నింగ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా ఎంపీల, ఎమ్మెల్యేల పనితీరు మారుతుందేమో చూడాల్సి ఉంది. పనితీరు విషయంలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తిని కూడా జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

2024 ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. ఇందుకు సంబంధించి జగన్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. రాయలసీమలో వైసీపీకి ఎదురులేదని కోస్తాంధ్రపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.