ఉద్యోగులపై సీఎం జగన్ పగబట్టారా.. రూల్స్ అమలు కావడం సాధ్యమేనా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆచరణలో సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులపై సీఎం జగన్ పగబట్టారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా జగన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు అమలైతే ఉద్యోగులలో జగన్ పై మరింత వ్యతిరేకత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

సలహాదారులు సైతం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించవద్దని ఉద్యోగులకు సూచనలు చేస్తున్నా ఆ సూచనలను జగన్ సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదు. 2024 ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే జగన్ సర్కార్ నిర్ణయాల వెనుక కారణం వేరే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించిన తీరు జగన్ ను బాధించిందని తెలుస్తోంది.

ప్రభుత్వం ఆప్షన్లు ఇచ్చినా ఆ ఆప్షన్లను పట్టించుకోకుండా ఉద్యోగులు వ్యవహరించడం జగన్ కు కోపం తెప్పించిందని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తుండటం కూడా జగన్ ను మరింత బాధ పెట్టిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రీజన్ వల్లే పది నిమిషాల కంటే ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు వేతనాలు కట్ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.

రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి కూడా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జీతాల్లో కోత అమలైతే మాత్రం ఉద్యోగులు జగన్ కు షాకిచ్చే ఛాన్స్ అయితే ఉంది. జగన్ చేస్తున్న చిన్న పొరపాట్ల వల్ల అధికారానికి దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది చెబుతున్నారు.