ఏపీ సీఎం జగన్ ను చూస్తుంటే.. ఓ సినిమాలోని డైలాగ్ గుర్తొస్తోంది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా? బుల్లెట్ దిగిందా లేదా? అంతే కదా.. సేమ్.. జగన్ ను చూస్తుంటే కూడా అదే అనిపిస్తోంది. జగన్ వచ్చింది మొన్ననే కానీ.. ఆయన తీసుకునే నిర్ణయాలు బుల్లెట్ దిగినట్టే టపా టపా దిగుతున్నాయి.
నిజానికి రాజకీయ నాయకుడికి ఎంతో అనుభవం ఉండాలి అంటారు. అనుభవం లేకపోతే.. రాజకీయాల్లో రాణించలేరు. పదవులను సక్రమంగా నిర్వర్తించలేరు అనేవారు కానీ.. సీఎం జగన్ మాత్రం ఏమాత్రం అనుభవం లేకున్నా… ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అది కూడా అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరాల్లోనే.
జగన్ ముఖ్యమంత్రిగా సూపర్ సక్సెస్ అయ్యారు. అందులో నో డౌట్. ఏపీలో జగన్ ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలను ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేదు. అంతలా ప్రఖ్యాతిని పొందాయి ఆ పథకాలు. కానీ.. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక.. ఏపీలో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించిన చంద్రబాబు మాత్రం ఏపీ ప్రజల మనసును గెలుచుకోలేకపోయారు. ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా పాలన చేసి.. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని మాట్లాడే బాబు.. ఎందుకు తనకు చాన్స్ ఉన్నప్పుడు ఏపీలో అభివృద్ధి చేసి చూపించలేకపోయారు అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.
అయితే.. 2022 లో జమిలీ ఎన్నికలు వచ్చినా.. రాకపోయినా.. 2024 లో సాధారణ ఎన్నికలు వచ్చినా.. మళ్లీ గెలిచేది జగనే కానీ.. చంద్రబాబు కాదు.. అని ఏపీ ప్రజలు నినదించేలా వాళ్ల మనసులో పాతుకుపోయారు సీఎం జగన్. ఏ రాజకీయ నాయకుడికైనా కావాల్సింది ఇదే కదా.