ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారన్ని వదులుకోవడానికి ఏ పార్టీ ఇష్టపడదు. సీఎం జగన్ కూడా 2019 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కూడా వైసీపీనే అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. టీడీపీ, జనసేన పుంజుకోవడం జగన్ కు ఏ మాత్రం ఇష్టం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆఖరికి లోకేశ్ పాదయాత్రకు కూడా జగన్ భయపడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ పాదయాత్రలో ఇష్టానుసారం మాట్లాడితే ఆ కామెంట్లు వైసీపీకి ప్లస్ అవుతాయి. లోకేశ్ ను నమ్మి ఓటు వేసే ప్రజలు తెలుగు రాష్ట్రాలలో లేరనే సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్రకు ఇబ్బందులు కలగజేస్తే ప్రజల్లో వ్యతిరేకత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
జగన్ ప్రజల్లోకి రారని ప్రజల్లోకి వచ్చేవాళ్లను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఇతర పార్టీలను తొక్కేయాలని చూడటం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ అనవసరంగా టెన్షన్ పడవద్దని వైసీపీ అభిమానులు భావిస్తున్నారు. జగన్ నెగిటివ్ కామెంట్లకు తావివ్వకుండా పరిపాలన సాగించాలని కొంతమంది సూచిస్తున్నారు.
సీఎం జగన్ ప్లానింగ్ ఏంటో అర్థం కావడం లేదని కొంతమంది వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నేతాల్లో కొంతమంది సొంత పార్టీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్లు కావాలని ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.