Super Six-Super Hit Celebrations: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ఓటమితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజల సంతోషానికి వీలు లేకుండా పాలించిందని, కేసులు పెట్టి వేధించిందని, ముఖ్యమంత్రి పర్యటనల కోసం చెట్లను కూడా నరికించిందని ఆరోపించారు. ఏపీలో తుగ్లక్ పాలన పోయిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాను తుగ్లక్‌ను కాదని.. కక్ష సాధింపులకు తావు లేదని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), తమ ప్రభుత్వం చేపట్టిన ‘సూపర్ సిక్స్’ (Super Six) పథకాల అమలుపై ధీమా వ్యక్తం చేశారు.
శ్రీలంకలో నిర్బంధంలో ఉన్న కాకినాడ జాలర్లు విడుదల: స్వదేశానికి తిరుగు పయనం
పవన్ జ్వరంపై వైసీపీ సెటైర్లు.. ‘అప్పటిదాకా తగ్గదు’ అంటూ శ్యామల ట్వీట్
తాము ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ (Super Six) హామీలను ‘సూపర్ హిట్’ (Super Hit) చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా పలు సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, వారికి తల్లికి వందనం కింద సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్త్రీశక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో పేదలకు పెన్షన్ల రూపంలో రూ. 48,019 కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వెల్లడించారు. పెన్షన్ డబ్బును 10 రెట్లు పెంచిన ఘనత టీడీపీదే అని ఉద్ఘాటించారు. ప్రతి నెలా ఒకటినే పెన్షన్ల పండుగ చేసుకుంటున్నామని గుర్తు చేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని, సంక్షేమం అమలులో ఎన్డీయే (NDA) ప్రభుత్వం టాప్‌లో ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) గ్రామస్తులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.


