సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్.! సర్వే చేయిస్తున్నదెవరు.?

ఒకప్పుడు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే సర్వేలు జరిగేవి. అంతకు ముందైతే, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే సర్వేలు జరిగేవి. కానీ, ఇప్పుడలా కాదు. ప్రతి నెలా సర్వేలు జరుగుతూనే వున్నాయి. ఆ మాటకొస్తే, ప్రతివారం సర్వేలు జరుగుతూనే వున్నాయి. ప్రైవేట ఏజెన్సీలు సర్వేలు చేయడం, వాటిని ఆయా రాజకీయ పార్టీలు కొనుక్కోవడం.. లేదా స్పాన్సర్ చేయడం అనేది సర్వసాధారణమైపోయింది. తెలుగు నాట పెద్ద సంఖ్యలో వివిధ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి.. రాజకీయాలకు సంబంధించి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకాస్త భిన్నంగా జరుగుతున్నాయంతే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సర్వే బృందాల సందడి నిత్యం కనిపిస్తూనే వుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.? అన్న కోణంలోనే మెజార్టీ సర్వేలు జరుగుతాయి. జరుగుతున్నాయి కూడా.! తాజాగా, ఓ ఇంట్రెస్టింగ్ సర్వే షురూ అయ్యింది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే.. టీడీపీ మద్దతుతో అది జరిగితే.. అన్న కోణంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారట.

జనసేన ఒంటరిగా, జనసేన – బీజేపీ కలిసి, జనసేన – టీడీపీ కలిసి, జనసేన – టీడీపీ – బీజేపీ కలిసి.. ఇలా మూడు కోణాల్లో ఈ సర్వేని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి, టీడీపీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీ అనుకూల మీడియా తెరవెనుకాల వుండి ఈ మొత్తం కథంతా నడిపిస్తోందిట. అంటే, రిజల్ట్ పవన్ కళ్యాణ్‌కి నెగెటివ్‌గా వస్తుందనేనా.?