అయ్యన్న హ్యాపీ… బాబు మాటమీద నిలబడితే గంటాకు సీటు లేనట్లే!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న చంద్రబాబు… ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేపనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాంతీయ సదస్సులు పెడుతూ కేడర్ లో కొత్త ఉత్సాహాలు నింపాలని భావిస్తున్నారు. దీంతోపాటు.. ఇంతకాలం తన పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫలితంగా కేడర్ హ్యాపీగా ఉంది. అయితే… ఈ నిర్ణయం వల్ల, తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ వల్ల… అయ్యన్న పాత్రుడు హ్యాపీగా ఉన్నరని అంటున్నారు విశ్లేషకులు!

ఇంతకాలం ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అంటున్న చంద్రబాబు… గతంలోలాగా కాకుండా.. ఇకపై ఎన్నికలకు చాలా ముందుగానే టిక్కెట్స్ కన్ ఫాం చేయాలని ఫిక్సయ్యారట. అవును… తాజాగా విశాఖలో జరిగిన ఉత్తరాంధ్రా ప్రాంతీయ సదస్సులో మాట్లాడిన చంద్రబాబు… ఈసారి ఎన్నికల్లో పనిచేసిన వారికే టికెట్లు ఇస్తామని.. ఆ విషయంలో ఎలాంటి మొహమాటాలు లేవని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో… గడచిన నాలుగేళ్ళుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారికే టికెట్లు ఇస్తామని కూడా బాబు నిక్కచ్చిగా చెప్పేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నాలుగేళ్లకాలంలో రోడ్డు మీదకు వచ్చి పోరాడిన వారికి మాత్రమే.. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తామని బాబు తేల్చి చెప్పారు.

ఇదే సమయంలో… పార్టీలో గ్రూపులు పెట్టి వర్గ పోరుని పెంచాలనుకునే వారికి.. ఇంతకాలం ప్రజలతో ఉండకుండా ఎన్నికల సమయంలో సీటు కోసం డ్రామాలాడేవారికి.. ఇంతకాలం పోరాటాలు చేయకుండా ఇంట్లో కూర్చున్నవారికీ ఎట్టిపరిస్థితుల్లోనూ టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని.. అలాటి వారికి ఎలాంటి పదవులు లేవని బాబు సీరియస్ గా క్లారిటీ ఇచ్చారు. దీంతో… హ్యాపీగా ఉన్నారంట అయ్యన్నపాత్రుడు.

ఎవరెవరికి టిక్కెట్ ఇచ్చేది లేదు అని బాబు చెబుతున్నారో… ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ గంటాకు ఉన్నాయని.. అయ్యన్న & కో హ్యాపీగా ఉన్నారంట. అవును… గత నాలుగేళ్లుగా గంటా శ్రీనివాస రావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తున్నాననే పేరుచెప్పి… అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకాలేదు. అసలే అంతంతమాత్రం బలంతో ఉన్న టీడీపీకి.. అసెంబ్లీలో మద్దతుగా నిలిచే ప్రయత్నం చేయలేదు.

అయితే… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఎంటరై హడావిడి చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సందడి చేశారు. దీంతో… ఎన్నికలు సమీపిస్తున్న వేల టిక్కెట్ల కోసం సందడిచేసే లిస్ట్ లో గంటా పేరుంటుంది కాబట్టి ఈసారి బాబు అన్నమాట ప్రకారం సీటివ్వరని అంటున్నారట అయ్యన్న ఫ్యాన్స్! గతంలోలాగా కాదు.. ఈసారి బాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారని చెబుతున్నారంట. దీంతోపాటు… ఇంతకాలం పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి – ఇంతకాలం ఇంట్లో కాకుండా, జనాల్లో ఉన్నవారికి టిక్కెట్లు అన్నారు కాబట్టి.. ఆ లిస్ట్ లో తనపేరు ఫస్ట్ ఉంటుందని ఫీలవుతున్నారంట అయ్యన్న!

మరి చెప్పిన మాటకు కట్టుబడి, అయ్యన్న ఆశిస్తున్నట్లు.. ఇంతకాలం పార్టీకోసం పనిచేసినవారికే బాబు టిక్కెట్లు ఇస్తారా? లేక గంటా లాంటి వారికి కూడా ఇస్తారా అన్నది వేచి చూడాలి!