చిరంజీవి అభిమానులు సూపర్ హ్యాపీ.. కానీ.!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవిని ‘సోదరుడు’ అంటూ సంబోదించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల నేపథ్యంలో ఆ మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగితే, ప్రధాని మోడీ సహా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చిరంజీవిని వైఎస్ జగన్ ‘సోదరుడు’ అని పేర్కొనడంతో, సభా ప్రాంగణం ఒక్కసారిగా ఈలలు, గోలలతో మార్మోగిపోయింది. దటీజ్ చిరంజీవి. ఆయన అజాతశృతువు. అందరివాడు. తెలుగునాట తిరుగులేని అభిమానగణం వున్న కథానాయకుడు. అంతే కాదు, ఆయన మాజీ కేంద్ర మంత్రి కూడా.

సరే, రాజకీయాల కోసం చిరంజీవిని చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అత్యంత జుగప్సాకరంగా చిరంజీవిని గతంలో విమర్శించిన రోజా, కూడా అదే వేదికపై వున్నారు. చిరంజీవికి బహుశా వైఎస్ జగన్ నుంచి దక్కిన గౌరవం పట్ల రోజా మనసులో నొచ్చుకుని వుంటారేమో.!

ప్రధాని నరేంద్ర మోడీ కూడా చిరంజీవితో చిన్నపాటి చిట్ చాట్ చేసినట్టున్నారు. భుజాలు పట్టుకుని మాట్లాడారు చిరంజీవితో నరేంద్ర మోడీ. ఇవన్నీ చిరంజీవి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దటీజ్ మెగాస్టార్.. అంటూ నినదించారు ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి అభిమానులు.

మరి, ఈ విషయమై పవన్ అభిమానులు ఏమంటున్నారు.? ఇంకేమంటారు.? పవన్ అభిమానులంటే, చిరంజీవిని అభిమానించేవాళ్ళు కూడా. వాళ్ళలో దాదాపు అందరూ జనసైనికులే. ఆ రకంగా జనసేన పార్టీలోనూ నూతనోత్తేజం వచ్చినట్లయ్యింది.