చింతమనేనికి చిర్రెత్తుకొచ్చింది

తన మీద సవాల్ విసిరిన జనసేన నేత పవన్ కల్యాణ్ కు టిడిపి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిసవాల్ విసిరారు.

బహిరంగ సభలలో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్ కల్యాణ్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, టివిలో వార్తలు ప్రసారం చేయిస్తున్నారని ఆరోపిస్తూ పవన్ చేతనయితే రాజకీయంగా ఎదుర్కోవాలని అని చెప్పారు.

 నిన్న పవన్ దెందులూరు సభలో మాట్లాడుతూ చేసిన అన్ని ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పారు. తానంత దుర్మార్గుడినే అయితే, దెందులూరు లో తన మీద పోటీ చేసి గెలవాలని ఆయన పవన్ కు చాలెంజ్ విసిరారు.

తనపై 37 ఒకసారి 27 కేసులు ఉన్నాయని పవన్ చెబుతున్నాడని అంటూ తనపై ఉన్నవి కేవలం 3 కేసులు మాత్రమేనని ఆయన అన్నారు. 

పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయనని, విప్,చీఫ్ విప్ కి ఉన్న తేడా కూడా పవన్ తెలియదని ఆయన అన్నారు. ‘నామీద పద్దెనిమిదేళ్ల కుర్రవాణ్ని పోటీ పెడతానంటున్నావ్. పెద్దనిమిదేళ్ల కుర్రవాడు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడని నీకు తెలియదా,’ అని ప్రశ్నించారు.

 

రాఫెల్ కుంభకోణం పై ఎందుకు మాట్లాడటంలేదో పవన్ చెప్పాలని ఆయన అన్నారు.

హోదా విషయాన్ని ఎందుకు మర్చిపోయావో చెప్పు అన్నారు.

మళ్ళీ ఎన్నికలలో గెలుస్తానని ధీమాగా చెప్పారు. తనను పదే పదే ప్రశ్నిస్తున్న విషయం చెబుతూ 

వైసీపీ ఎమ్మెల్యేలు పై అనేక కేసులు ఉన్నాయి, వాటిని గురించి మాట్లాడవా, పులివెందుల కు వెళ్లి ఇలాగే ప్రశ్నిస్తావా అని అన్నారు.

పవన్ కళ్యాణ్ తనపై వ్యక్తిగత విమర్శలు చేసారని, అయితే తానల చేయదల్చుకోలేదని తాను వ్యక్తి గత ఆరోపణలు చేస్తే పవన్ మూడురోజులు తిండే తినలేడని అన్నారు.      ‘నా మీద మీరు చేసిన ఆరోపణలను మీకు నచ్చిన వారితో  త్రీ మెంబర్  కమిటీ వేసి దర్యాప్తు చేయించండి, నెల తరువాత చర్చకు సిద్ధం అని చింతమనేని సవాల్ విసిరారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ప్రతాపం చూపించానని అన్నారు,ఆయన పై అనేక కేసులు ఉన్నాయి ఆయన్ని సమర్థిస్తారా

దివ్యఅంగుడి పై తాను దాడికి పాల్పడ్డానని ఆరోపణ సరికాదు,తనపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని పవన్ కు సవాల్ విసిరారు.

 బజారు మనిషిలా మాట్లాడవద్దని పవన్ కు సలహా ఇస్తూ ,‘‘నన్నురాజీకీయంగా ఎదుర్కో. రా, దెందులూరు నుంచి పోటీ చేయ్. గెలిస్తే అభినందించి నియోజక వర్గంలో ఊరేగిస్తాను, ’’ అని అన్నారు