ఏలూరులో క్షుద్ర పూజల కలకలం… భయంతో పరుగులు తీసిన విద్యార్థులు…?

ప్రస్తుతం సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఇలా ఒకవైపు దేశం ఇలా అభివృద్ధి దిశగా కొనసాగుతుంటే మరొకవైపు మూఢనమ్మకాలు శుద్ధ పూజల పట్ల ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారు. ఇలాంటి శుద్ధ పూజలకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వాటి గురించి అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ కొంతమంది క్షుద్ర పూజల పేరుతో ప్రజలలో భయాన్ని కలిగిస్తున్నారు. తాజాగా ఏలూరులో కూడా కాలేజీ బస్సులో చేసిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఈ ఘటనతో విద్యార్థులందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురై పరుగులు తీశారు.

వివరాలలోకి వెళితే… ఏలూరు జుల్ల ,నూజివీడు మండలం క్రిష్ణారావుపాలెంలో క్షుద్రపూజల కలకలం రేగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో నిలిపి ఉంచిన ఓ ప్రైవేటు కాలేజి బస్సులో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే పిల్లలు ప్రయాణించే బస్సులో క్షుద్రపూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇలా కాలేజీ బస్సులో నిద్ర పూజలు చేసినట్లు ఆడవాళ్లు ఉండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో స్థానికుల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులోకి వెళ్లి పరిశీలించగా బస్సు మధ్యలో ముగ్గులు వేసి అన్నం ముద్దలు,మిరపకాయలు,నిమ్మకాయలు పెట్టారు. అలాగే నిమ్మకాయలు పసుపు కుంకుమ వేసి వాటిని మాలగా కట్టి బస్సులో డ్రైవర్ సీటు వెనుకాల తగిలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఎవరైనా కావాలనే ఇలా చేశారా? లేక ఆకతాయి వెధవలు ప్రజలను భయపెట్టటానికి ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం విద్యార్థులను మరొక భక్తులు కాలేజీకి తరలించింది.