చంద్రోదయం.! ఇంటర్మీడియట్‌లో బైసీపీతో ఇంజనీరింగ్.!

మాట్లాడేటప్పుడు.. తడబాటు అన్నది ఎవరికైనా సహజమే. కానీ, ఇది సోషల్ మీడియా యుగం.! చిన్నదానికీ, పెద్దదానికీ.. ఏకిపారేస్తున్న రోజులివి. విపరీతమైన ట్రోలింగ్ చిన్న చిన్న విషయాలకే జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విజన్ 2047 అంటున్నారు. ఒకప్పుడు విజన్ 2020 అన్నారు.! 2020 దాటేశాం కదా.. అందుకే, 2047 అంటున్నారాయన.! సరే, నాయకులకు విజన్ అనేది ముఖ్యం. అందులో చంద్రబాబు విజన్ అంటే కొంతమందికి కామెడీగానే వుంటుంది.

విజన్ సంగతి పక్కన పెడితే, ఇంజనీరింగ్ చేయడానికి ఇంటర్మీడియట్‌లో బైసీపీ తీసుకోవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. విపరీతమైన ఆక్షేపణకి గురవుతున్నాయి. వయసు మీద పడ్డంతో చంద్రబాబుకి, బుర్ర పని చేయడంలేదంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఏకిపారేస్తోంది.

దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, ‘రాష్ట్రానికి ఓ మహిళ ముఖ్యమంత్రిగా వున్నారు’ అంటూ మొన్నామధ్య స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ ప్రస్తావిస్తోంది. అంతే కాదు, ‘టోల్ గేట్ కట్టడానికి బైక్ పార్క్ చేసింది అధ్యక్షా..’ అంటూ దిశ ఘటనపై సీఎం జగన్, అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని టీడీపీ ప్రస్తావిస్తోంది.

మరోపక్క, బైపీసీ చేసినా ఇంజనీరింగ్ చేయడానికి వీలుగా కేంద్రం కొన్నాళ్ళ క్రితం కొత్త ప్రతిపాదనల్ని తీసుకొచ్చిన విషయాన్ని టీడీపీ పేర్కొంటూ, సంబంధిత వివరాల్ని సోషల్ మీడియాలో వుంచుతోంది. నిజమే.. బైపీసీ చేసినవాళ్ళకీ, కొన్ని ఇంజనీరింగ్ కోర్సులు చేసేందుకు వెసులుబాటు వుంది.

అయితే, ఇదంతా బుకాయింపుల పర్వం మాత్రమే.! ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ, మెడిసిన్ అంటే బైసీపీ.. ఇదే కదా.. బహుళంగా ప్రచారంలో వున్న విషయం.

#@AKnewschannel Chandrababu In Vizag 2047 Vision