గత ప్రభుత్వ హయాంలో జగన్ సంక్షేమ పథకాలు బాగానే అమలు చేశారు! కోవిడ్ వంటి కష్టకాలంలోనూ కమిట్మెంట్ మిస్సవ్వకుండా డీబీటీలు అందించారు. అయితే… అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని కూటమి రంగంలోకి దిగింది. ప్రధానంగా “సూపర్ సిక్స్” అంటూ చంద్రబాబు తెరపైకి తెచ్చిన పథకాలకు.. ముఖ్యంగా మహిళా లోకం బ్రహ్మరథం పట్టింది. ఫలితంగా కూటమి అధికారంలోకి వచ్చింది.
మరి చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడటం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే చంద్రబాబు ఐదు ఫైల్స్ పై సంతకాలు చేశారు. అందులో పెన్షన్ రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వాగ్ధానం మేరకు ఏప్రిల్ నుంచే పెరిగిన మొత్తం వెయ్యి వెయ్యి కలిపి మూడు వేలు కూడా అందిస్తున్నారు!
ఆ సంగతి అలా ఉంటే… పెన్షన్ తో పాటు పలు కీలక హామీలు ఇచ్చారు చంద్రబాబు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అధికారంలోనూ కనీసం రెండో నెల నుంచైనా అవి అమలు చేయాలి. 2014 – 19 సమయంలో చివరాఖరున నిరుద్యోగ భృతి ఇచ్చినట్లు చేస్తామంటే… ఈసారి పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. పైగా అటు పవన్ పొలిటికల్ కెరీర్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనపైనే ఆధారపడి ఉంటుందనేది తెలిసిన విషయమే!
మరి ఈ సమయంలో.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. సంవత్సరానికి మూడు గ్యాస్ సెలెండర్లు ఉచితం.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000 పై ప్రజలు తీవ్ర ఆశలుపెట్టుకున్నారని అంటున్నారు. జగన్ అధికారంలో ఉండి ఉంటే… అమ్మ ఒడి, రైతు భరోసా వంటివి ఇప్పటికే అంది ఉండేవనే కామెంట్లు గ్రామీణా ప్రాంతాల్లో అప్పుడే మొదలైపోయాయి.
ఎందుకంటే… ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం అయిపోయింది. మరోపక్క వర్షాలు కురిసి రైతంగాంగం పంటలు సాగులో నిమగ్నమైంది. అందుకే అమ్మ ఒడి, రైతు భరోసా నిధుల కోసం మహిళలు, రైతులు ఎదురుచూస్తున్నారు. పైగా గత ఐదేళ్లూ ఈ విధానానికి అలవాటు పడిపోయారు.. డేట్ మారకుండా జగన్ డీబీటీ ల రూపంలో డబ్బులు అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విషయాలపై పెదవి విప్పడం లేదు.
కూటమి అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించిన సూపర్ సిక్స్ విషయం తప్ప చంద్రబాబు మిగిలినవి అన్నీ మాట్లాడుతున్నారు. ఏపీ అంటే… అమరావతి, పోలవరం అని చెబుతున్నారు. శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. అవి కూడా పరిపాలనలో భాగలే కావొచ్చు కానీ… ఇచ్చిన హామీలు సమయానికి అమలు చేయడం అత్యంత ముఖ్యం అనే విషయం చంద్రబాబు మరోసారి వ్యూహాత్మకంగా తప్పిస్తున్నారు.
పైగా గత రెండు మూడు రోజులుగా ఒక వర్గం మీడియాలో ఒక కీలక ప్రస్థావన మెల్లమెల్లగా జనాల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు! ఇందులో భాగంగా… మాజీ సీఎం జగన్ విచ్చలవిడిగా అప్పులు చేశారని, అందువల్ల సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి దాపురించిందని చెప్పడానికి జనాలను మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. అంటే… నేరం జగన్ పై వేసి తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయ్తనానికి పునాదులు మొదలైపోయాయన్నమాట.
మరి సంక్షేమ పథకాల అమలు ఆల్ మోస్ట్ సాధ్యం కాదని.. ఉన్న డబ్బులన్నీ జీతాలు, పెన్షన్లు, అమరావతి, పోలవరం లకు మాత్రమే పెట్టే ఆలోచనలూ చేస్తున్నారని వినిపిస్తున్న కామెంట్లను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. నిజంగానే చంద్రబాబు జూలై నుంచే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలుచేయని పక్షంలో.. జనాలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!!
అంటే… చంద్రబాబుకు ఉన్న ఒక బ్రహ్మాస్త్రం “అభివృద్ధి”కే పెద్ద పీట అని! అది ఒక బ్రహ్మపదార్థం అని అంటుంటారు పరిశీలకులు. అంటే… అభివృద్ధి మాటున సంక్షేమాన్ని పక్కనపెడతారన్నమాట! మరి ఈసారి కూడా ఆ బ్రహ్మాస్త్రం చంద్రబాబుకు వర్కవుట్ అవుతుందా.. లేక, ఈసారి ప్రజలు ఆ బ్రహ్మాస్త్రాన్ని తిప్పి కొడతారా అనేది వేచి చూడాలి!