ఎవరు అవునన్నా కాదన్నా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లక్షల సంఖ్యలో ఓట్లు ట్యాపరింగ్ జరిగిందనే వాదన ఓ వర్గం నుంచి బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఓ సంస్థ సుప్రీం కోర్టు తలుపు తట్టింది! ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు 49 లక్షల ఓట్ల ట్యాపరింగ్ జరిగిందనే చర్చ విపరీతంగా జరుగుతుంది.
సీఎంగా ఉన్నప్పుడు జగన్ కొన్ని మిస్టేక్స్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ.. అది 11 స్థానాలకు పరిమితమయ్యేటంత మాత్రం కాదంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎలా తుంగలోకి తొక్కారో తెలిసి కూడా 2024లో ప్రజలు మరోసారి ఎలా మోసపోవడానికి సిద్ధంగా ఉంటారని ఇంకొంతమంది నిలదీస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే… జనాల్లో జగన్ కి ఉన్న క్రేజ్ వేరని.. పేదలకు జగన్ అంటే ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదని.. కరోనా కష్టకాలంలో కూడా సాకులు నెతుక్కోకుండా, “భయమేస్తోంది” అంటూ అసెంబ్లీ పెర్ఫార్మెన్స్ చేయకుండా.. ఇచ్చిన ప్రతీ హామీనీ నేరవేర్చే ప్రయత్నం చేశారు.. అధికారంలోకి వచ్చిన 15 రోజుల నుంచే హామీలు అమలు చేశారు.
పైగా అప్పటికి చంద్రబాబు దిగిపోతూ ఖజానాలో ఉంచింది రూ.100 కోట్లు మాత్రమే కాగా.. రెండేళ్లపాటు కరోనా ఖజానాకు చెక్ పెట్టిన పరిస్థితి! అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడటంతో… జగన్ కి జనాల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది! ఇప్పుడు ఈ విషయం తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్, మంత్రులకు తెలిసొచ్చిందని అంటున్నారు!
వివరాళ్లోకి వెళ్తే… వైఎస్ జగన్ అసెంబ్లీ గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. తనకు మైకు ఇవ్వరని, తనకు ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడే అవకాశం ఉండదని జగన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… హైకోర్టునూ ఆశ్రయించారు. దీంతో… మంత్రుల నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు వరకూ ప్రస్తుతం జగన్ ని బుజ్జగించేపనిలో ఉన్నాట్లు కనిపిస్తున్నారు!
ఇందులో భాగంగా… తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రుల నుంచి స్పీకర్ వరకూ రిక్వస్టులు చేస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ కచ్చితంగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రులు చెబుతుండగా.. ఆ విషయంలో తనది భాధ్యత అన్నట్లుగా స్పీకర్ అయ్యన్న భరోసా ఇస్తున్నారని చెబుతున్నారు.
దీంతో… ఉన్నఫలంగా ఏపీలోని మంత్రులకూ, స్వయంగా స్పీకర్ కు (సీఎం మాత్రం బయటపడినట్లు లేరు!) జగన్ అసెంబ్లీకి రావడం అనే అంశంపై ఇంత శ్రద్ధ, ఆసక్తి ఎందుకొచ్చిందబ్బా? అనే ప్రశ్నలు హల్ చల్ చేయడం మొదలుపెట్టాయి. అయితే… దీనికి పెద్ద కారణం ఉందని.. ఇటీవల జగన్ పెట్టిన ప్రెస్ మీటే అదని చెబుతున్నారు.
అవును… ఇటీవల అసెంబ్లీలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసి, అనంతరం చంద్రబాబు ప్రసగించారు. అయితే… సరిగ్గా అదేసమయంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్వేతపత్రాలపై నిప్పులు కక్కారు.. అసలు లెక్కలు ఇవంటూ కొన్ని విషయాలు బయటపెట్టారు.. చంద్రబాబుని కడిగిపారేశారు!!
ఈ సమయంలో రెండు విషయాలనూ మీడియా ప్రసారం చేసింది. అయితే ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాన్ని, అందులో చంద్ర్బాబు ప్రసంగాన్ని ఆన్ లైన్ లో చూసిన్వారు 50వేల పైచులుకు మాత్రమే ఉండగా… జగన్ ప్రెస్ మీట్ ని మాత్రం 7 లక్షలకు పైగా వీక్షించారు! దీంతోనే… కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడిందని చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే… ముందు ముందు ఇదే కంటిన్యూ అయితే… ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసేవరు తగ్గిపోవడంతోపాటు, సరిగ్గా అదే సమయంలో జగన్ ప్రెస్ మీట్ లు చూసేవారి సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించడమే కాదు, పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారంట.
దీంతో… మార్పుదిశగా చేసిన ఆలోచనలో భాగంగా… కూటమి మంత్రులు జగన్ ను రిక్వస్ట్ చేస్తున్నారని.. స్పీకర్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా జగన్ ని బుజ్జగిస్తున్నారని అంటున్నారు!