చంద్రబాబు 2019 ఫలితాల తర్వాత కూడా నేర్చుకోలేదా?

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి ఉన్న ఎన్నో కారణాల్లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడం.. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా ఒక ప్రధాన కారణం అనేది విశ్లేషకులు అభిప్రాయం. అందుకే 2019 ఎన్నికల్లో వారికి 23 సీట్లే వచ్చేలా ఆ ప్రజలు, దేవుడూ తీర్పు ఇచ్చారని జగన్ చెబుతుంటారు.

దీంతో ఇక చంద్రబాబుకు జ్ఞానం వచ్చి ఉంటుంది.. ఇకపై ఇలాంటి అనైతిక రాజకీయాలు, అప్రజాస్వామిక రాజకీయాలు చేయరని అంతా భావించారు. కానీ చంద్రబాబు మారలేదని మరోసారి స్పష్టం అయ్యింది. నెల్లూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జ్ పదవులు కట్టబెట్టారు దీంతో… వారితో ఎమ్మెల్యే పదవులకు రాజినామా చేయించిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించకుండా.. వైసీపీ జెండాపై గెలిచిన వారిగా ఉండగానే ఇలాంటి పనులకు పూనుకొంటున్నారంటూ విమర్శలు మొదలైపోయాయి.

అవును… వైసీపీ నుంచి బయటకు పంపబడ్డ ఇద్దరు ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ ఇన్ ఛార్జులుగా ప్రకటించుకున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా… ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డిని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు… తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్‌ టీడీపీ ఇన్ ఛార్జ్ గా చంద్రబాబు ప్రకటించారు. దీంతో… మరోసారి 2019 ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ చర్చ తెరపైకి వచ్చింది.

అయితే చంద్రబాబు ఇలాంటివేవీ పట్టించుకోరని, రాజ్యాంగంపై ఆయనకు అంత గౌరవం లేదని, ప్రజాభిప్రాయాలపై ఆయనకు విలువ లేదని… అందుకే పక్క పార్టీలో గెలిచిన వారిని నిస్సిగ్గుగా తమ పార్టీలో చేర్చుకుంటుంటారని.. ప్రజలు 2019లో ఈ మేరకు గట్టిగా బుద్దిచెప్పినా బాబుకు చీమకుట్టినట్లయినా ఉండదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో… ఎవరికో పుట్టిన బిడ్డను తనకు పుట్టిన బిడ్డగా చెప్పుకుని ఎత్తుకుని ముద్దాడుతున్నారనే కామెంట్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి.