ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఒకవైపు హాట్‌హాట్‌గానూ మరోవైపు మస్త్ ఎంటర్‌టైనింగ్‌గానూ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అసెంబ్లీ సమావేశాలు అంటే అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజా శాసనసభ సమావేశాల్లోనూ తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ జరుగుతున్నా, ఎందుకోగాని ఈసారి మాత్రం ఓ రేంజ్‌లో ఖతర్నాక్ కామెడీ పండిస్తూ రియాలిటీ షోలను తలపిస్తోంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి అంసెంబ్లీలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును ఓ రేంజ్‌లో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. తొలిరోజు నుండే జాతర స్టార్ట్ చేసిన చంద్రబాబు పొడియం దగ్గర బైఠాయించి ఈ కామెడీ డ్రామాకి తెరలేపారు. అలాగే మాటమాటకి వేలు చూపిస్తూ కళ్ళెర్రజేస్తూ ఊగిపోతున్న చంద్రబాబును చూస్తూ.. ముఖ్యమంత్రి జగన్ కళ్ళదగ్గర చేతులు పెట్టి, వామ్మో భయమేస్తుంది బాబోయ్ అంటై అంటూ చేసిన సైగలు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ తర్వాత మంత్రి కొడాలి నాని అయితే బట్టలు ఊడదీసినా లవంగం నాయుడుకు బుద్ది రాలేదని అంటూ ఓ రేంజ్‌లో వాయించడమే కాకుండా.. గాలి పార్టీ అని మతి మరుపు జబ్బుతో బాధ పడుతున్న గాలి నాయుడు అంటూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ గాలి తీసేశాడు. ఇక రెండో రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల్ని ఎలా మోసం చేశాడో అసెంబ్లీలో షో వేసి మరీ చూపించడంతో, అప్పుడు చంద్రబాబు ముఖం చూసినవారు, పాయే.. ఫసక్ అంటూ సోషల్ మీడియాలో బాబును తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఇక మూడోరోజు అయితే పోలవరం ప్రాజెక్ట్ రగడలో భాగంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే అసెంబ్లీలో చాకిరేపు పెట్టేశాడు. పాయింట్ టు పాయింట్ గ్యాప్ ఇవ్వకుండా బండమీద బట్టలు ఉతికినట్లు ఉతికేశాడు. ఇక ఆ తర్వాత మొదలైంది అసెంబ్లీ సాక్షిగా సంచలన కామెడీ. టీడీపీ ప్రెజెంట్స్ అంటూ చంద్రన్న భజన వీడియోను ప్లే చేసి అసెంబ్లీలో నవ్వులు పూచించాడమే కాకుండా బాబుకు ఉన్న కాస్త పరువు గంగాపాల్ చేశారు.
గతంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో సెటైర్స్ వేస్తూ చంద్రబాబు ముఖం మాడిపోయేలా కవ్వించేవారు. చంద్రబాబు తనకు మిత్రుడు అని కాస్త నవ్వవయ్యా బాబు అంటూ ఆడుకునేవారు. వైఎస్ఆర్ వేసే సెటైర్స్‌కు తట్టుకోలేక ఆగ్రహంతో ఊగిపోయేవారు చంద్రబాబు. అయితే ఇప్పుడు జగన్ హయంలో అంతకు మించి సీన్ రిపీట్ అవుతోంది. ఏ పాయింట్ తీసుకున్నా చివరకు చంద్రబాబు దగ్గరకు చేరుకుని ఆయన్ని ఫూల్ చేస్తుండడంతో, బాబు చేష్టలు ఆయన ఊగిపోతూ రియాక్షన్స్ అసెంబ్లీలో కామెడీ పంచుతోంది. దీంతో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పొలిటీషియన్‌గా ట్రోల్ అవుతూ గూగుల్‌ను ఊపేస్తున్నాడు చంద్రబాబు.