భారీ ఎత్తున నిధుల సమీకరణ.. 2024లో బాబును డబ్బే గెలిపిస్తుందా?

ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని డబ్బు గెలిపిస్తుందా అనే ప్రశ్నకు కొంతమంది అవుననే సమాధానం చెబితే మరి కొందరు కాదని సమాధానం చెబుతారు. అయితే ఎన్నికల్లో డబ్బు ప్రభావం కొంతమేర కచ్చితంగా ఉంటుంది. తమకు డబ్బులు ఇవ్వలేదని కొన్ని ప్రాంతాలలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించిన సందర్భాలు సైతం గతంలో ఉన్నాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో తాను ఓటమిపాలు కావడానికి డబ్బు పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని భావిస్తున్నారు. వైసీపీతో పోల్చి చూస్తే టీడీపీ డబ్బు పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అదే తమ పార్టీ పాలిట శాపమైందని ఆయన అనుకుంటున్నారు. ఎన్నికలకు కొన్నిరోజుల ముందు పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మహిళల ఖాతాలలో నగదును జమ చేయడం జరిగింది.

అయితే ఆ డబ్బు పథకం ద్వారా ఇచ్చిన డబ్బు కావడంతో ప్రజల మనస్సులను గెలుచుకోలేకపోయాననే భావనను చంద్రబాబు కలిగి ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ తప్పు రిపీట్ కాకుండా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటినుంచే భారీఎత్తున నిధుల సమీకరణ దిశగా ఆయన అడుగులు వేస్తుండటం చర్చకు తావిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నిధుల సమీకరణన విషయంలో ఒకింత సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.

అమరావతి భూములపై పెట్టుబడులు పెట్టిన వాళ్లు చంద్రబాబును గెలిపించుకోవడానికి తమ వంతుగా ఎకరాకు 30,000 రూపాయల చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది. అమెరికా పర్యటనల ద్వారా ఈ మొత్తాన్ని మరింత పెంచుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు భారీగా ఖర్చు పెట్టే సామర్థ్యం ఉన్న నేతలకు మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కనున్నాయని తెలుస్తోంది.