కొత్త సర్వే రిపోర్ట్ తో ఆశ్చర్యపోతున్న బాబు!

గత ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయమే పట్టింది. చంద్రబాబుతో సహా ఏ టీడీపీ నేతా ఊహించని ఆ దెబ్బ నుంచి కోలుకుని మళ్లీ మాములు మనిషి అవ్వడానికి బాబు తీసుకున్న సమయం తక్కువేమీ కాదు! అనంతరం గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బాబూకు కాస్త హోప్ కలిగించాయి. అయితే తాజాగా ఒక సొంత సర్వే చంద్రబాబును షాక్ కి గురిచేసిందని తెలుస్తుంది.

ఎన్నికలు సమీపిస్తున వేళ ఒక సొంత సర్వే చంద్రబాబును తెగ టెన్షన్ పెడుతుందని తెలుస్తుంది. జనసేనతో పొత్తు ఆల్ మోస్ట్ ఫైనల్ అయిన అనంతరం చేసిన ఈ సర్వే ఫలితాలపై బాబు సంతృప్తికరంగా లేరని తెలుస్తుంది. కారణం… ఈ సారి టీడీపీ విషయంలో పార్టీ కంటే ఎక్కువగా అభ్యర్థుల క్రెడిబిలిటీపైనే ఓట్లు పడనున్నాయని తేలడమే అని తెలుస్తుంది.

జగన్ ని విమర్శించేశాం.. పవన్ తో కలిసిపోయా.. ఇక మనకు తిరుగులేదు అని చంద్రబాబు భావిస్తున్నారనే కథనాలొస్తున్న సమయంలో… దిమ్మతిరిగే షాక్ తగిలిందని తెలుస్తుంది. ఈ సర్వే ప్రకారం… చంద్రబాబు మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారని తేలిందంట. సీట్ల విషయంలో కాస్త వ్యత్యాసం ఉండొచ్చు కానీ… రిజల్ట్ మాత్రం ఆల్ మోస్ట్ సేం ఉండొచ్చని ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయంట.

అయితే పార్టీ పేరు కాదు.. వ్యక్తుల ప్రభావమే కీలకం కాబోతుందని తెలుస్తున్న తరుణంలో… బీజేపీతో పొత్తు ఆలోచన వచ్చిందని తెలుస్తుంది. అలా అని ఏపీలో బీజేపీకి ఏమీ భారీ ఓటు బ్యాంకు లేదు. కానీ… ఎంపీ కేండిడేట్లలో కొంతమంది అంగబలం, అర్థబలం ఉన్న నేతలు ఉండటంతో… వారి గెలుపు మినిమం గ్యారెంటీ అని బాబు నమ్ముతున్నారని, అందులో భాగంగానే అమిత్ షా ముందు వాలిపోయారని చెబుతున్నారు.

దీంతో… ఈ ఫలితాలు నిజమే కావొచ్చు. అసలు.. ఒంట‌రిగా పోటీ చేసినా అధికారం వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌మే వుంటే… చంద్రబాబు జ‌న‌సేన‌, బీజేపీ వైపు చూసేవారు కాదుకదా అని అంటున్నారు పరిశీలకులు. అయితే ఈ భయాన్ని పవన్ గ్రహించలేకపోయారు. కారణం… బాబు కంటే ఎక్కువగా పవన్ భయపడుతున్నారు. అయితే బాబు భ‌యాన్ని మాత్రం ముందుగానే పసిగట్టింది బీజేపీ. మరి ఈ భయాన్ని సాకుగా తీసుకుని రానున్న రోజుల్లో ఏపీ రాజ‌కీయాన్ని బీజేపీ ఎలా మ‌లుపు తిప్ప‌బోతోందనేది వేచి చూడాలి.