వివేకా కేసులో జగన్ అడ్డంగా దొరికిపోయారు.. చంద్రబాబు మాటలకు అర్థం ఉందా?

Chandrababu-Naidu-1-1200x800

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివేకా హత్య కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ సహాయంతో వివేకా హత్య కేసులో సులువుగా దొరికిపోతానని జగన్ ఊహించి ఉండరని చంద్రబాబు కామెంట్ చేశారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

గూగుల్ టేకౌట్ టెక్నాలజీతో తాను ఇరుక్కుంటానని జగన్ ఊహించి ఉండరని ఆయన చెప్పుకొచ్చారు. వివేకా హత్యకు ముందు తర్వాత నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని అవినాష్ రెడ్డి అక్కడినుంచి లోటస్ పాండ్ లోని జగన్ ఇంటికి ఫోన్ చేశారని చంద్రబాబు షాకింగ్ ఆరోపణలు చేశారు. గూగుల్ టేకౌట్ ద్వారా ఇది గుర్తించినట్టు సీబీఐ అఫడవిట్ లో స్పష్టంగా పేర్కొన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

జగన్ కోడికత్తి కమల్ హాసన్ అని వివేకా లోటస్ పాండ్ కు ఫోన్ వెళ్లిన తర్వాత గుండెపోటు నాటకానికి తెర తీశారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు జగన్ మాటలు నమ్మి నర హంతకుడికి ఓట్లు వేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. షర్మిలకు కడప లోక్ సభ టికెట్ ఇవ్వాలని అడగటం వల్లే ఈ హత్య జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వివేకా హత్య కేసులో ఇద్దరుముగ్గురు ఎగిరిపోయారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ల ఆస్తులు రాయించుకుంటున్న ఆర్థిక ఉగ్రవాది జగన్ అని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వెనుక భయంకరమైన కథలు ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.