హస్తిన వేదికగా వైసీపీ ఎంపీల కొనుగోళ్లకు తెరలేపిన బాబు!?

ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమాత్రం ఎలాంటి సందేహాలు లేకుండా ఏపీ అసెంబ్లీలో కూటమి బలం ఉంది. అసెంబ్లీ వరకూ ఈ బలం సరే కానీ… శాసనమండలికి వచ్చే సరికి సందేహలు పుష్కలంగా ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంటే… ప్రధానంగా ఢిల్లీలో చంద్రబాబు కంటే జగన్ కు బలం ఎక్కువగా ఉందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

ప్రధానంగా లోక్ సభలో ఎలాగూ బీజేపీ బిల్లులను పాస్ చేసుకోగలుగుతుంది. సరిపడా బలం ఉంది. అది లేకపోతే ప్రభుత్వమే కూలిపోతుంది. అదే వేరే సంగతి! కానీ… రాజ్యసభలో పరిస్థితి అందుకు పూర్తి విభిన్నంగా ఉంది. అక్కడ బీజేపీకి ఎన్ డీయే కూటమితో పని జరగదు. కచ్చితంగా వైసీపీ మద్దతు కావాలి. అక్కడ వైసీపీ మద్దతు ఉంటేనే బీజేపీ గట్టేక్కగలుగుతుంది.. అలా కానిపక్షంలో ఇది రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్కే!

అయితే మోడీ & కో అంత రిస్క్ చేయరు. కచ్చితంగా జగన్ సహాయ సహకారాలు తీసుకుంటారు. జగన్ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నారనేది తెలిసిన విషయమే. పైగా రాజ్యసభలో టీడీపీ స్కోరు సున్నా.. వైసీపీ బలం 11. లోక్ సభలో కూడా వైసీపీ బలం సున్నా కాదు.. నలుగురు ఎంపీలు ఉన్నారు. అంటే… ఎలా చూసినా పూర్తి మెజారిటీ లేని బీజేపీకి వైసీపీ అవసరం రాజ్యసభలో కంపల్సరీ.. లోక్ సభలో కూడా తీసిపారేయలేని పరిస్థితి.

కట్ చేస్తే… ఈ విషయం చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని.. ఏపీలో అధికారం వచ్చిన ఆనందం లేకుండా చేస్తుందని అంటున్నారు. కారణం… జగన్ పై చంద్రబాబు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే.. కచ్చితంగా కేంద్రంలో పెద్దల సహకారం కంపల్సరీ. అయితే… రాజ్యసభలో జగన్ మద్దతు అవసరం అని తెలిసిన మొడీ & కో అందుకు ససేమిరా అంటారు. ఈ సమయంలోనే చంద్రబాబులో ఉన్న 40 ఏళ్ల ఇండస్ట్రీ మనిషి బయటకు వచ్చాడని చెబుతున్నారు.

దీంతో… రాజ్యసభలో ఉన్న వైసీపీ ఎంపీలపై బాబు కన్నుపడిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న బాబు… అదేపనిలో బిజీగా ఉన్నారని, వైసీపీ రాజ్యసభ ఎంపీలపై దృష్టి సారించారని.. వారిని ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు. రాజ్యసభలో వైసీపీ బలం తగ్గిస్తే.. ఇక బీజేపీ పెద్దల దగ్గర తనకు తిరుగుండదనేది బాబు ఆలోచన అని అంటున్నారు. అయితే… ఆ అవకాశం ఆల్ మోస్ట్ శూన్యం అనేది పరిశీలకుల అభిప్రాయంగా ఉంది.

పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలకు ఏమాత్రం విలువ లేకపోయినా… వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూసే అవకాశం ఉండోచ్చు కానీ.. ఇప్పుడు టీడీపీ ఎంపీలకంటే ఎక్కువగా వైసీపీ రాజ్యసభ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వంలోనూ, బీజేపీ పెద్దలవద్దా పూర్తి గౌరవం ఉన్నప్పుడు, అవసరం కనిపిస్తున్నప్పుడు… విడిపోయి పలుచన అయ్యే ఆలోచన వైసీపీ రాజ్యసభ ఎంపీలు చేయరనేది చాలామంది చెబుతున్న మాట.

కానీ… బాబు మాత్రం ఈ విషయంలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, పెద్ద బేరాలే ముందు పెడుతున్నారనే చర్చ బలంగా నడుస్తుంది. మరి చంద్రబాబుకు వైసీపీ రాజ్యసభ ఎంపీలు లొంగుతారా.. బేరాలకు అమ్ముడవుతారా.. లేక, నిక్కచ్చిగా నిలబడతారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా… తిరిగి అధికారంలోకి వచ్చిన బాబు అప్పుడే కొనుగోళ్లకు తెరలేపడం చర్చనీయాంశం అవుతుంది.