బాబు – పవన్ సీట్ల స్కెచ్… కాపులకు నయా వెన్నుపోటు!

తెలియకుండా జరిగిపోతే పొరపాటు.. తెలియకుండా చేస్తే తప్పు అనుకుంటే… పక్కా ప్లానింగ్ గా చేస్తే, వ్యూహాలు పన్ని మరీ చేస్తే అది మోసం! ప్రస్తుతం కాపుల విషయంలో చంద్రబాబుతో కలిసి పవన్ చేస్తున్న పని ఇదే.. మోసం.. పక్కా మోసం అని అంటున్నారు పరిశీలకులు. అందుకు కారణం… తాజాగా బాబు & పవన్ వేస్తున్న స్కెచ్ అని అంటున్నారు.

అధికారికంగా టీడీపీ – జనసేన పొత్తు కన్ ఫాం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఈనాటి బంధం కాదనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఈ క్రమంలో జనసేనకు 20 నుంచి 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే కామెంట్లు టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే… 23 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేనకు కేటాయించనున్నారని సమాచారం.

అయితే ఈ విషయం బయటకు వచ్చిన అనంతరం జనసైనికుల్లోనూ, కాపు సమాజికవర్గంలోని పెద్దల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలుస్తుంది. ఈ సెగ పవన్ కు నేరుగా తగిలిందని చెబుతున్నారు. దీంతో… పవన్ కల్యాణ్ – చంద్రబాబులు మరో ప్లాన్ చేశారని తెలుస్తుంది. అందులో భాగంగా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు కొంతమంది టీడీపీ నేతలను జనసేనలోకి పంపబోతున్నారని అంటున్నారు.

అవును… టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్న కొంతమంది కాపు, బలిజ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకు జనసేన కండువాలు కప్పి, అనంతరం వారిని జనసేన నేతలుగా తెరపైకి తెచ్చి.. జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చినట్లుగా మాయ చేయబోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది సీనియర్ల వారసులను ఈ కోవలోకి తీసుకురాబోతున్నారని సమాచారం.

అలా ఒక 15మంంది బలిజ, కాపులను జనసేనలో చేర్పించి టిక్కెట్ ఇస్తే జనసేనకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చినట్లు ఉంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయం కాగా… అక్కడ కూడా మనోళ్లే ఉన్నారని, రేపు పవన్ తోక జాడించే ఛాన్స్ ఉండదనేది బాబు నమ్మకం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… చంద్రబాబు కాపులను మోసం చేయాలనుకోవడం తనస్టైల్ రాజకీయం అనుకుంటే… పవన్ కూడా మోసం చేయాలనుకోవడం వెన్నుపోటు అని అంటున్నారు పరిశీలకులు!

దీంతో ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెతకు ఈ కొత్త ఆలోచన అని చెబుతున్న మోసం నిలువెత్తు నిదర్శనం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.