ప్రముఖ రాజకీయ పార్టీలలో ఒకటైన తెలుగుదేశం పార్టీ వేస్తున్న తప్పటడుగులు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా పొత్తుల గురించి, ఇతర విషయాలపై దృష్టి పెడుతూ కాలయాపన చేస్తున్నారు. టీడీపీ పొత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ సొంతంగా గెలవలేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు టీడీపీ 2024 ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చే హామీలేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ ఇచ్చిన హామీలనే టీడీపీ అమలు చేస్తుందని చెబితే మరి టీడీపీ వల్ల ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు పలు ప్రముఖ నియోజకవర్గాల్లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అవుతోంది.
ఆర్థికంగా కూడా టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జరుగుతున్న తప్పులను గుర్తించకపోతే టీడీపీ ఊహించని స్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. టీడీపీ అనుకూల పత్రికలు మినహా మరెక్కడా 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపించకపోవడం గమనార్హం.
2024 ఎన్నికల్లో టీడీపీ గెలవని పక్షంగా ఆ పార్టీ 40 సంవత్సరాల చరిత్ర ముగిసినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వెలువడితే మాత్రమే ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుందని అలా జరగని పక్షంలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.