లాస్ట్ ఛాన్స్: ….ఇలా అడగగలరా బాబు?

ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది తెలిసిన విషయమే. అయితే.. తన రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా చేసి చూస్తే… 2019 ఎన్నికలకు ముందు – 2019 ఎన్నికల తర్వాతలా మారిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. అప్పటివరకూ బాబు పరిస్థితి వేరు.. తనపై తనకున్న నమ్మకం, రాజకీయ చాణక్యం వేరు.. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి వేరు!

తన పొలిటికల్ కెరీర్ ఇంక ముగిసిపోబోతుంది.. తనకు దాదాపు ఇవే చివరి ఎన్నికలు.. లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి.. అనే మాటలతో ఈసారి ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు చంద్రబాబు. అసలు చంద్రబాబుకు ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? వయసైపోతుంది కాబట్టా? 2029 ఎన్నికలను చూస్తారో లేదో అనా? దీనిపై తాజాగా విశ్లేషణలు సాగుతున్నాయి!

“నా జీవితం మొత్తం ప్రజలకే త్యాగం చేశాను.. బ్రతికినంతకాలం ప్రజలకోసమే ఆలోచించాను.. అధికారంలో ఉన్నా – ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలను ఒకేరకంగా ట్రీట్ చేశాను.. ప్రస్తుతం జీవిత చరమాంకంలో ఉన్నాను.. మరోసారి నా ప్రజలకు శేవచేసుకునే అవకాశం, గతంలోని నా పాలనను మరోసారి ప్రజలకు రుచిచూపించే భాగ్యం కల్పించమని కోరుతున్నాను.. అదే మీరు నాకిచ్చే లాస్ట్ ఛాన్స్!” అని చంద్రబాబు ప్రజలను నేరుగా అడగగలరా? అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ!

నాకు వయసైపోతుంది కాబట్టి లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని బాబు అడగితే… అసలు అందులో ప్రజలకు ఏమి సంబందం అనేది మరో ప్రశ్న! ఇలా చంద్రబాబేమో ఒక్క లాస్ట్ ఛాన్స్ అంటుంటే… మరో పదేళ్లు చంద్రబాబు సీఎం గా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చినబాబు కోరుతున్న పరిస్థితి! మరి ప్రజలు ఈ విషయాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో బబ్బులే చెప్పాలి!

ఏది ఏమైనా… ఇది ఫైనల్ ఎలక్షన్ అయినా, సెమీ ఫైనల్ ఎలక్షన్ అయినా… తన గత పాలనను జ్ఞప్తికి తెచ్చేదిగా, తన గత పాలన వైభవాన్ని మురిపించేదిగా ఉండే పాలనను అందిస్తానని బాబు గారు జనాల్లోకి వస్తే వాస్తవ ఫలితాలు వస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!