నష్ట పరిహారం పెంచిన చంద్రబాబు.. డబ్బులిస్తే ఏం చేసినా చెల్లుతుందా?

కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారనే వార్త తెలిసి చాలామంది చంద్రబాబును తిడుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. గ్రౌండ్ ఖాళీగా ఉండగా ఇరుకు సందులో సభ నిర్వహించాలన్న చంద్రబాబు తెలివితేటలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నష్ట పరిహారం విషయంలో విమర్శలు రావడంతో ఆ మొత్తాన్ని చంద్రబాబు మరింత పెంచారు.

మొదట 10 లక్షల రూపాయల సహాయం ప్రకటించగా ప్రస్తుతం టీడీపీ 23 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం 2 లక్షల రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. డబ్బులిస్తే ఏం చేసినా చెల్లుతుందా అంటూ కొంతమంది చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం గమనార్హం.

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సభ సక్సెస్ చేయడం కోసం చంద్రబాబు ఎన్నో తప్పులు చేస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎనిమిది మంది మృతిని రాజకీయ హత్యగా పరిగణించాలని వైసీపీ నేతల నుంచి తీవ్రస్థాయిలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మరి కొందరు చెబుతున్నారు.

సేఫ్ ప్లేస్ లో మీటింగ్స్ జరగాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. కూలీకి వెళ్లే మహిళలను డబ్బులు ఆశ చూపి సభకు పిలిపించారని సమాచారం అందుతోంది. పుష్కరాల సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గతంలో కూడా 29 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.