2019 ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారు అయ్యింది. గెలిచిందే కొన్ని సీట్స్ వాటిలో కొంతమంది వైసీపీలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, మిగిలిన వారు అసలు ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. అలాగే ఇప్పుడు ఇప్పుడు వైసీపీ నుండి టీడీపీపై కక్ష్య సాధింపు రాజకీయాలు చేస్తుంది. అందుకే టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు లాంటి నాయకుడినే వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపించింది. అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది.
చంద్రబాబు హయాంలో రాజధానిగా నియమించిన అమరావతిలో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు యొక్క బినామీలు అక్కడ భూములు కొనుగోలు చేశారని, ఒక సామాజిక వర్గం వారికి మాత్రమే భూములు ఇచ్చారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.
అయితే ఇప్పుడు ఈ అవకాశాన్ని చంద్రబాబు వాడుకుంటే టీడీపీ తిరిగే ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎలాగంటే వైసీపీ ప్రభుత్వం తనపై సీబీఐని ప్రయోగించే లోపు చంద్రబాబే గడిచిన ఐదేళ్ల పాలనపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్ట్ లో పిటిషన్ వేస్తే టీడీపీకి రానున్న రోజుల్లో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎలాగో తన పాలనలో ఎలాంటి అన్యాయం జరగలేదని చంద్రబాబు చెప్తున్నాడు అలాంటప్పుడు సీబీఐ విచారణను తానే కోరితే బాగుంటుందని టీడీపీ నాయకులు కూడా భావిస్తున్నారు. 2014 జూన్ 2వ తేదీ నుండి 2019 మార్చి 1వ తేదీ మధ్యలో విడుదల చేసిన జీవోలు, విడుదల చేసిన నిధులు, సంక్షేమ పథకాలు, పరిపాలన, టెండర్లు వీటన్నింటిపై కూడా సీబీఐ విచారణ చేయాలంటూ ఆయనే కోర్టులో పిటిషన్ వేసుకుంటే దేశంలోనే సంచలన నిర్ణయం తీసుకున్న నాయకుడిగా మిగిలిపోతారు. టీడీపీ వస్తున్న కష్టాల్లో ఇదొక సంజీవినిలా కనిపిస్తుంది. దీన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోకుంటే రానున్న రోజుల్లో పార్టీ నేతలకు కష్టాలు తప్పవు.