టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత కాలం మేనిఫెస్టో అంటే కేవలం వాగ్ధానాలకే పరిమితం. ఎన్నికలకు ముందు అది చేస్తాను…ఇది సాధిస్తానని గొప్పలన్నింటికి మెనిఫెస్టో అనే ముసుగు తొడిగి గారిడీ మాటలు చెప్పి మసిపూసి మారేడు గాయ చేయడం ఆయనకే తెలుసని నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవంలో ఎన్నోసార్లు తేటతేల్లమైంది. నాలుగు దశాబ్ధాలు గా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఆయన ప్రజల్ని ఎంతగా వంచించారో అందరికీ తెలిసిందే. మాట ఇస్తాం..మడము తిప్పడం తమకే తెలుసని ఎన్నోసార్లు రుజువు చేసిన ఘనత..చరిత్ర ఆయనకే సొంతం.
మూడు పర్యాయాల ముఖ్యమంత్రి అనుభవంలో మోసానికి మారుపేరుగా ఖ్యాతికెక్కడం ఆయనకే చెల్లింది. సాక్షాత్తు పక్క రాష్ర్ట సీఎం కేసీఆర్ అన్నిసార్లు ముఖ్యమంత్రిని చేయడం అన్నది ఏపీ ప్రజలు చేసుకున్న పాపం అన్నారంటే? చంద్రబాబు రాజకీయ చరిత్ర ఎంత హేయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన పదవిలో ఉన్నంత కాలం కేవలం ఆయన సామాజిక అభివృద్దికి పాటుపడ్డారు తప్ప! బడుగు బలహీన వర్గాల భవిష్యత్ కు ఏరోజైనా పునాది వేసిన సంఘటన మచ్చుకు ఒక్కటీ లేదని చెప్పొచ్చు. ఆయనగారి భోగోతం బట్టబయలు చేయడంలో సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషించదని చెప్పొచ్చు.
ఏ నాయకుడు ఎలా పాలిస్తున్నాడు? ప‌్రజల నాయకుడు ఎవరు? అని నేరుగా తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఎంతో ఉపయుక్తమైంది. అందుకే 2019 లో ప్రజలు చంద్రబాబుకు చెంప పెట్టులాంటి సమాధానంతో తీర్పునిచ్చారు. 175 స్థానాలకు గాను 155 స్థానాలు వైకాపాకు కట్టబెట్టి…23 స్థానాలతో చంద్రబాబుకు ఊపిరి మాత్రమే పోసారు. రాష్ర్టంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జరిగిన మార్పుల గురించి ప్రజలే ముందుకొచ్చి చెప్పారు కాబట్టి ఆయన ప్రజల హృదయాల్లో గొప్ప నాయకుడిగా నిలిచి అసువులు బాసారు. మా దేవుడు చనిపోయాడని ఎన్టీఆర్ స్వర్గస్తులైన తర్వాత అంతగా కీర్తింపబడింది కేవలం వైఎస్సార్ ఒక్కరే.
ఇప్పుడు వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ర్టం సుభిక్షంగా..సంతోషంగా ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. రాష్ర్టం ఆర్ధిక పరిస్థితి బాగోక పోయినా ప్రజలకిచ్చిన మాట కోసం మడము తిప్పకుండా పనిచేస్తున్నారు. ఏడాది కాలంలో నే 90 శాతం వాగ్ధానాలు అమలు దిశలో అడుగులు వేసారు. మేనిఫెస్టో లో మొత్తం హామీలు 129 అయితే వాటిలో ఇప్పటికే 77 అమలు చేసారు. డేట్లు ఇచ్చి సిద్దంగా ఉన్నవి 36. ఆవిధంగా చూసుకుంటే 90 శాతం వాగ్దానాలు దాదాపు పూర్తయినట్లే. మిగిలిన 16 హామీలను అమలు చేయాల్సి ఉంది.
వాటిని కూడా వీలైనంత త్వరగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతీ ఇంటికి మేనిఫెస్టో పుస్తకం పంపుతామని, ఆ పుస్తకంలో ఉన్న పనులు చేసామా? లేదా? అన్నది ప్రజలే చెప్పాలన్నారు. ఇది ఎంత సంచలన నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అది ఒక్క జగన్ కే చెల్లింది. మేనిఫెస్టో అంటే మాటలివ్వడం కాదు…చేతల్లో అది చేసి చూపించాలని జగన్ నిరూపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు యంగ్ ని చూసి నేర్చుకోవాల్సింది..తెలుసుకోవాల్సింది ఇదీ. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని ఆశిద్దాం.