రిస్క్ మొత్తం జనసేనకు ఆఫర్ చేస్తున్న బాబు… తెరపైకి మరో సీటు!

జనసేన ప్రచార రథం “వారాహి” యాత్ర జూన్ నెల 14 నుంచి ప్రారంభమవ్వబోతోన్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకూ సాగనుంది. గోదావరి జిల్లాల్లో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని చెబుతున్న జనసేన అధినేత పవన్… ఈ మేరకు తొలివిడత యాత్రను ఈ ప్రాంతంలోనే మొదలుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన కొన్ని నియోజకవర్గాల పేర్లతోపాటు తాజాగా మరో పేరు యాడ్ అయ్యింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో టీడీపీ కష్టమైన సీట్లు చాలానే ఉన్నాయి! గత ఎన్నికల్లో థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకున్న స్థానాలు కూడా ఉన్నాయి! దీంతో… తూర్పు గోదావరి జిల్లాల్లో పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వారాహి యాత్రకు పవన్ కు అనుమతి దొరికిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇప్పుడు ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ వైసీపీ కూడా బలంగానే ఉంది. దీంతో చంద్రబాబు ఈ రిస్క్ ను పవన్ కు వదిలేశారని అంటున్నారు.

రాబోయే ఎన్నికల్లో పొత్తులు అధికారికంగా కన్ ఫాం అయిన అనంతరం… పవన్ కు చంద్రబాబు కేటాయించే సీట్లు కూడా ఇవే అనే కథనాలు వస్తున్నాయి. అయితే… ఇవన్నీ టీడీపీకి రిస్క్ సీట్లను, దాంతో అవి పవన్ కు కేటాయించి.. మిగిలిన ప్రాంతాల్లో జనసేన ఓట్లను ఫుల్ గా దక్కించుకోవాలని బాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తమకు కొరుకుడు పడని మరో సీటును కూడా జనసేనకు వదిలేసిందంట టీడీపీ.

అవును… తిరుప‌తిలో ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉండటం, టీడీపీ బలహీనంగా ఉండటంతో పాటు వైసీపీ కూడా అత్యంత బలంగా ఉన్న ఈ సీటును కూడా జనసేనకు వదిలేస్తుందంట టీడీపీ. తిరుప‌తిలో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌ రెడ్డి, ఆయ‌న కుమారుడు అభియ‌న్‌ ల‌ను ఎదుర్కొనేందుకు టీడీపీలో స‌రైన నేత‌లు లేర‌ని బలంగా నమ్ముతున్న బాబు… ఆ రిస్క్ పవన్ కి ఆఫర్ చేశారని తెలుస్తుంది.

ఇలా రిస్క్ తో కూడుకున్న నియోజకవర్గాలను, వైసీపీ చావు దెబ్బ కొట్టే ఛాన్స్ ఉన్న సీట్లను ఎంపికచేసి మరీ పవన్ కు అప్పగిస్తున్నారంట బాబు. అయితే ఈ సీట్ల కేటాయింపు విషయం వెనుక దాగిఉన్న బాబు వ్యూహం అర్ధంకాక… సంబరాలు చేసుకుంటున్నారంట జనసైనికులు!

ఆ సంగతులు అలా ఉంటే… రాబోయే ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ జనసేన నుంచి ఇద్దరు అభ్యర్థులు తిరుప‌తి ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్‌, డాక్టర్ హరి ప్రసాద్ లు పోటీ పడుతున్నారని తెలుస్తుంది. మరి చంద్రబాబు ఇచ్చిన ఈ రిస్క్ ఆఫర్ ను జనసేన ఏమేరకు ఉపయోగించుకోగలుగుతుంది.. ఎలాంటి ఫలితాలను పొందబోతోంది అనేది తెలియాలంటే… వచ్చే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే!