ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజుపేయిని పరామర్శించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.
చంద్రబాబు నాయుడితో వాజ్ పేయికి చాలా అనుబంధం ఉంది. వాజ్ పేయి ప్రధాని గా ఉన్నపుడు ఢిల్లీ రాజకీయాలలో కలక పాత్ర పోషించింది తెలుగుదేశం అధినేతయే. వాజ్ పేయి ప్రభుత్వం నిలబడేందుకు కొండంత అండగా నిలబడిందే చంద్రబాబు నాయుడే. అయితే, దీనికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడికి ఆ రోజు వాజ్ పేయి ప్రభుత్వం కూడా అలాగే అపురూప గౌరవం చూపించింది. నాయుడూ జీ అంటూ ఆయన చంద్రబాాబు నాయుడిని పలకరించేవారు. ఢిల్లీ రాజకీయాలలో నాయుడూ జీ అనే నాలుగక్షరాలు అపుడు ప్రతిధ్వనిస్తూ ఉండేవి. చంద్రబాబు నాయుడి రాక కోసం ఢిల్లీ నిరీక్షిస్తూ ఉందా అని పించేలా నాటి ముఖ్యమంత్రి రాక దేశ రాజధానిలో సంచలనం సృష్టించేది. ఆయనెపుడూ ఢిల్లీ వెళ్లినా ప్రధాని అప్యాయకంగా ఆహ్వానించే వారు. ఎన్నో గొప్ప పథకాలు అపుడు చంద్రబాబు నాయుడి సూచనలతో రూపొందాయి. ఆంధ్రప్రదేశ్ కు విపరీతంగా నిధులొచ్చాయి. తెలుగు నాట ముఖ్యంగా జాతీయ రాహదారులెంతో అభివృద్ధి చెందాయి. తెలుగు రాజకీయాల్లో వాజపేయి ప్రధాని గా ఉన్న రోజులు ఒక మరచిపోలేని ఘట్టం.స్వర్ణ యుగం.
అలాంటి స్నేహశీలి వాజ్ పేయిని పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు.
వాజ్ పేయి కోలుకోవాలని కోరదాం.
ఎయిమ్స్‌లోనే అమిత్ షా మకాం…
బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం అంతకంతకు క్షీణించడంతో కేంద్ర మంత్రులతో పాటు పార్టీ నేతలు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించారు. కాగా వాజ్‌పేయికి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో ఎయిమ్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.
బుధవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు వాజ్‌పేయిని పరామర్శించారు.
అలాగే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. గత 24 గంటల్లో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని బుధవారం రాత్రి 10.15 గంటలకు ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
కాగా కిడ్నీ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో వాజ్‌పేయ్ జూన్ 11న ఆస్పత్రిలో చేరారు.అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు.