Chandra Babu: జేసీ అస్మిత్ రెడ్డి పై చంద్రబాబు ఫైర్.. అదే కారణమా?

Chandra Babu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్న ఎమ్మెల్యేల పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులను కూడా మందలించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా ఆదినారాయణ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి అనే విధంగా వివాదాలు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పై జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తూ చాలెంజ్ లు విసురుతూ వచ్చారు. ఇలా వారి మధ్య చోటు చేసుకున్న ఈ వివాదంపై చంద్రబాబు నాయుడు జెసి అస్మిత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు అనంతపురంకి వచ్చిన సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుని రిసీవ్ చేసుకోవడం కోసం విమానాశ్రయానికి జెసి అస్మిత్ రెడ్డి వెళ్లారు.

ఇలా అస్మిత్ రెడ్డి వెళ్లడం చంద్రబాబు నాయుడు ఈ వివాదం గురించి ఆరా తీయడమే కాకుండా తనకు వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తుంది.బాహాటంగా గొడవలకు దిగడం ఏంటని, సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా? అని ప్రశ్నించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ కార్యకర్తలకు పనులు కల్పించేందుకేనని అస్మిత్‌రెడ్డి సమాధానం చెప్పగా కార్యకర్తల గురించి నేను చూసుకుంటాను కదా అంటూ చంద్రబాబు అస్మిత్ రెడ్డిని మందలించినట్టు తెలుస్తోంది.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెసి అస్మిత్ రెడ్డి కంటే కూడా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.