హాట్ టాపిక్… జగన్ ఆలోచనలకు జై కొడుతున్న చంద్రబాబు!

ప్రస్తుతం చంద్రబాబు చెబుతున్న మాటలు, ఇస్తున్న హామీలు, చేస్తున్న ప్రసంగాలు అన్నీ క్షుణ్నంగా పరిశీలించే వారికి ఆయనపై జాలి వేస్తుందని అంటున్నారు పరిశీలకులు! గొప్ప విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు.. అందరికంటే పదేళ్లు ముందుగానే అలోచిస్తారాని.. 20ఏళ్ల తర్వాత గురించి ప్లాన్ చేస్తారని రకరకాలుగా చెబుతారు కానీ… తాజా పరిస్థితిని చూస్తుంటే మాత్రం అదంతా ప్రజలపై రుద్దబడ్డ ఒక అసత్య ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం తప్ప వాస్తవం లేదని ఈ జనరేషన్ అనుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు! హాట్ టాపిక్… జగన్ ఆలోచనలకు జై కొడుతున్న చంద్రబాబు!

అవును… ఐటీ, సెల్ ఫోన్, అమరావతిలో ఒలింపిక్స్ వంటి ఎన్నో విషయాలపై స్పందించిన చంద్రబాబు… రానున్న ఎన్నికల కోసం ఇస్తున్న హామీలు చూసినవారెవరికైనా… జగన్ హామీలు డబుల్ చేయడం తప్ప, జగన్ మస్తిష్కంలోంచి పుట్టిన ఆలోచనలకు పేరు మార్చి ఫలితాలు రెట్టింపు చేస్తానని చెప్పడం తప్ప కొత్తగా చెబుతున్నది ఏముంది? అనేది సామాన్యుడి ప్రశ్నగా ఉంది! ఇక సంపద సృష్టించి వాటిని ఖర్చు పెడతాం అనే ఒక బ్రహ్మ పదార్ధాన్ని మాత్రం గ్యాప్ లో వదులుతున్నారు.

2014 నుంచి 2019 వరకూ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉండి సృష్టించిన సంపద ఏమిటి.. చేసిన అభివృద్ధి ఏమిటి అంటే.. కియా ఫ్యాక్టరీ ఫోటో ఒకటి పెట్టి పోస్ట్ చేస్తారు! ఆ సంగతి అలా ఉంటే… తాజాగా జగన్ సైన్యంగా చెప్పే వాలంటీర్లకు గొప్ప వరం ప్రకటించారు చంద్రబాబు. అందులో భాగంగా… వారి గౌరవ వేతనాన్ని 5 వేల నుంచి 10 వేలకు పెంచుతామని ప్రకటించారు.

నిన్నమొన్నటివరకూ వాలంటీర్లు 30 – 50 వేలు సంపాదించేలా స్కిల్ డెవలప్ మెంట్ తో శిక్షణ ఇప్పిస్తామని చెప్పిన ఆయన… ఇప్పుడు వాలంటీర్లకు డబుల్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు! దీంతో… చంద్రబాబు పరిస్థితి ఇంత దయణీయంగా మారిపోయిందేమిటబ్బా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఎన్నికల సీజన్ కు ముందు చంద్రబాబ్బు & కో లు వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు నమ్మాలా.. ఎన్నికల వేల ఆయన ఇస్తున్న తన మార్కు హామీలను నమ్మాలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

వాస్తవానికి హామీలు ఇవ్వడం.. ఆనాక తూచ్ అనడం లో చంద్రబాబు పీ.హెచ్.డీ చేశారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంటాయి. గతంలో రుణమాఫీ, నిరుద్యోగ భృతి విషయంలో ఆయన నాలుక మడతపెట్టిన సంగతి ఇంకా అందరికీ గుర్తుండే ఉందనేది ఇక్కడ పాయింట్!

ఈ ఒక్క విషయమే అనుకుంటే పొరపాటే సుమా…!! ఇప్పటివరకూ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని ఆల్ మోస్ట్ రెట్టింపు చేస్తామన్నట్లుగానే చంద్రబాబు హామీలు ఉంటున్నాయనే విమర్శ ప్రజల్లో బలంగా వినిపిస్తుంది! పైగా… అన్ని హామీలు కంటిన్యూ చేస్తూ.. కొత్త హామీలు ఇస్తామని చెబుతున్నారు! ఇప్పటివరకూ జగన్ ఇస్తున్న హామీలతోనే రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని విమర్శలు చేసిన చంద్రబాబు… తాను రెట్టింపు చేస్తే సోమాలియా అవ్వదా అనేది మరో ప్రశ్న!

దీంతో… గతంలో ఉన్న గౌరవాన్ని కూడా చంద్రబాబు పోగొట్టుకుంటున్నారనే కామెంట్లు ఒకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి. గతంలో వాలంటీర్ల గురించి చంద్రబాబు & కో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటున్న నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు పెడుతున్నారు.

ఇందులో భాగంగా… “గోనె సంచులు మోసే వారికి.. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు డోర్లు కొట్టేవారికి.. అమ్మాయిలను, ఒంటరి మహిళలను ట్రాప్ చేసేవారికీ.. వైసీపీ కార్యాకర్తలుగా పనిచేసే వారికీ చంద్రబాబు ఇలా 10వేల రూపాయలు ఇస్తామని సగర్వంగా ప్రకటించడం చూస్తుంటే… చంద్రబాబు పరిస్థితి ఎంత దయణీయంగా ఉందనేది అర్ధం అవుతుంది” అని అంటున్నారు!!

ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… జగన్ కి పాలన తెలియదు అని ఇంతకాలం విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన చేపట్టిన పాలనా సంస్కరణలనే తాము అమలు చేస్తామని చెబుతున్నారు. జగన్ చేసిన ఆలోచనలను, జగన్ విజన్ ను తాము పునికిపుచ్చుకుని స్క్వేర్ చేస్తామని చెబుతున్నారు. దీంతో… చంద్రబాబుని వైసీపీ శ్రేణులు ఒక ఆట ఆడుకుంటున్న సంగతి కాసేపు పక్కనపెడితే… చంద్రబాబు కూడా జగన్ ఆలోచనలకు జై కోడుతున్నారనే అంటున్నారు పరిశీలకులు.