ఆంధ్రప్రదేశ్ అంసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా తొలిరోజు హాట్‌హాట్‌గా జరిగాయి. ముఖ్యంగా ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాకు కావల్సినంత స్టఫ్‌ను అందించారు. తొలుత కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి డ్రామా మొదలు పెట్టిన చంద్రబాబు, వైసీపీ నేతల కవ్వింపుల దెబ్బకు బీపీ పెరగడంతో సభలో ఓ రేంజ్‌లో ఊగిపోయిన చంద్రబాబు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
ఒకవైపు టీడీపీకే చెందిన నాయకుడు మాట్లాడుతుంటే, చాక్లెట్ కోసం పిల్లలు మారం చేసినట్టు మైక్ కోసం పెద్ద డ్రామానే క్రియేట్ చేశాడు. మరోవైపు సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయకుడని, వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గాలి తీసేయడమే కాకుండా బాబు డ్రామాను పాయింట్ టు పాయింట్ ప్రెజెంట్ చేస్తూ సెటైర్స్ వేయడంతో 40 ఇయర్స్ బాబు ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో మతిలేని చర్యలకు తెరలేపి పొడియం దగ్గరకు వెళ్ళి భైఠాయించి నిరసన తెలిపారు.
అసలే చంద్రబాబుకు మీడియాలో పబ్లిసిటీ పిచ్చి. గత కొద్దిరోజులుగా ఏ మీడియా కూడా చంద్రబాబును పట్టించుకోవడలేదు. అన్ని మీడియల్లో జగన్ పేరు మారుమోగిపోతుంది. ఇలా అయితే తాను పూర్తిగా కనుమరుగు అయిపోతానని భావించాడో ఏమో అసెంబ్లీలో తన మార్క్ స్టైల్ పబ్లిసిటీ స్టంట్స్‌కు తెరలేపాడు. అయితే గతంలో చంద్రబాబు జమానాలో, అసెంబ్లీలో ఎక్కువ బలగం ఉండేది.. అలాగే బయట అనకూల మీడియా చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా డైవర్ట్ చేసేది.
ఇప్పుడు రాష్ట్రంలో జగన్ జమానా నడుస్తుంది కదా.. చంద్రబాబు ఎన్నిరకాలుగా ఎత్తులు వేసినా వెంటనే సోషల్ మీడియలో ఏకిపారేస్తున్నారు. దీంతో బాబు అనుకూల మీడియా ఏం చేయలేక చూస్తూ ఉండాల్సిన పరిస్థితి.. దీంతో తాను ఎలాగైనా హైలెట్ కావాలని భావించిన చంద్రబాబు అసెంబ్లీలో తనదైన స్మార్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. చంద్రబాబు మైండ్‌బ్లోయింగ్ పర్ఫామెన్స్‌కు అక్కడే ఉన్న జగన్ తనదైన స్టైల్‌లో జగన్ రియాక్షన్ ఇచ్చారు.
చంద్రబాబు వైపు వామ్మో భయమేస్తుంది అన్నట్టు రియాక్షన్ ఇస్తూ జగన్ పగలబడి నవ్వడంతో, మరింత ఊగిపోయిన చంద్రబాబు, అక్కడ సిట్యువేషన్‌ను మరింత రక్తి కట్టించేందుకు మరింత రెచ్చిపోయడు చంద్రబాబు. దీంతో చంద్రబాబుతో సహా 12 మంది ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేశారు. దీంతో సోషల్ మీడియలో అసెంబ్లీలో చంద్రబాబు ఆస్కార్ పెర్ఫామెన్స్ పై ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఏదో చానాళ్ళకు పెద్దాయన భాస్కర్ రేంజ్‌లో కామెడీ చేస్తే గుర్తించకపోవడమే కాకుండా పెద్దాయన అనే గౌరవం లేకుండా సంస్పెండ్ చేస్తారా అని సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు మాత్రం చంద్రబాబు సోషల్ మీడియాను ఊపేస్తున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.