బాబుని ఒక ఇంటివాడిని చేస్తోన్న జగన్… ఈసారి సింగపూర్ వాళ్లు కాదు!

ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే ఇవే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించేసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవం కూడా అదేనని, మరో ఆప్షన్ లేదని కూడా ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా వైఎస్ జగన్ కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.

అవును… ఈసారి కుప్పంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబుని ఓడించి తీరాలని జగన్ పంతంపట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా ఈ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి చేతుల్లో ఉంచారనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో పెద్దిరెడ్డి కూడా కుప్పంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టి రెగ్యులర్ గా నియోజకవర్గంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలో “కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు స్థానికేతరుడు” అనే విషయాన్ని తెరపైకి తెస్తోన్నారు వైసీపీ నేతలు. అయితే ఈ స్థానికేతరుడు, 7సార్లు గెలిపించినా కుప్పానికి మంచినీరు తేలేని అసమర్ధుడని ప్రజలకు చెప్పడం మొదలుపెట్టింది. ఫలితంగా.. స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి ఫలితాలు అందుకుంది.

దీంతో వైసీపీ చేస్తోన్న ప్రచారం వల్ల తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందని చంద్రబాబు గ్రహించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఇప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు. దీంతో… కుప్పంలో 100 సెంట్లు భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు పరిస్థితిని అర్ధం చేసుకున్న ప్రభుత్వం… అన్ని రకాల అనుమతులు మంజూరు చేసిందంట.

దీంతో ఎన్నికలకు ఇంకా సుమారు ఎనిమిది నెలల సమయం ఉంది కాబట్టి… ఈ లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని బాబు భావిస్తున్నారంట. ఏ సింగపూర్ కంపెనీకో కాంట్రాక్ట్ ఇచ్చి అమరావతిలా అటూ ఇటూ కాకుండా చేయకుండా… దేశీయంగా ఉన్న సంస్థకే అప్పగించి నిర్మాణం వెగంగా పూర్తి చేయాలని నిర్ణయించారంట. దీంతో… స్థానికేతరుడు అనే పేరును బాబు ఈ వయసులో చెరుపుకోవాలని భావిస్తున్నారంట.

దీంతో.. ఏది ఏమైనా.. 75 ఏళ్ల వయసులో చంద్రబాబుని కుప్పంలో ఒక ఇంటివాడిని చేస్తున్నారు జగన్ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి స్థానికంగా కట్టుకోబోతోన్న ఇల్లు కుప్పంలో చంద్రబాబుకు ఎలాంటీ ఫలితాలు ఇవ్వబోతోందనేది వేచి చూడాలి.