కుందేలుకు మూడేకాళ్లు… విశాఖ వాసులు అన్నారంటున్న బాబు!

చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయినా కూడా ఆలోచనా విధానం మారలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత అభిప్రాయాలను, తన స్వార్థపూరిత ఆలోచనలను ప్రజల అభిప్రాయాలుగా చెప్పడం, వాటిని తమ అనుకూల మీడియాలో తిరిగి జనాలపై రుద్దడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. ఈ సమయంలో తాజాగా విశాఖలో మరోమారు అలాంటిపనికే పూనుకున్నారు చంద్రబాబు.

అవును… విశాఖ అంటే కాస్మో పాలిటిన్ సిటీ. అన్ని వర్గాలు అన్ని రాష్ట్రాలు అన్ని మతాలు, ప్రాంతాల ప్రజలతో కూడిన సిటీ. అలాంటి విశాఖ వాసుల విషయంలో చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. సుమారు పాతిక లక్షలకు పైగా ఉన్న విశాఖ జనాభాపై తనదైన వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాన్ని వారి అభిప్రాయంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా… విశాఖ వాసుల మనోగతం తనకు తెలుసు అని చెప్పుకున్న చంద్రబాబు… విశాఖ వాసులు సైతం అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. విశాఖలో కూర్చుని మరీ చంద్రబాబు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ఒక వైపు విశాఖ మీద ప్రేమ ఉందని చెబుతూనే.. మరో వైపు విశాఖకు రాజధాని వద్దు అంటున్నారు. అమరావతి రాజధాని కావాలని విశాఖ వాసులు అనుకుంటున్నారు అన్నది బాబు మాటగా ఉంది.

దీంతో చంరబాబు పద్దతి ఇంకా మారలేదు… జనం ఆలోచనా విధానం మారింది, బ్లఫ్ మాస్టర్స్ కి ఇక ఏపీ రాజకీయాల్లో చోటు లేదు అని చెబుతున్న తరుణంలో… బాబు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆల్ రెడీ రెడీ మేడ్ సిటీగా ఉన్న విశాఖ, ఏపీలో ఏకైక మెట్రో సిటీగా ఉన్న విశాఖ వాసులు.. విశాఖను కాదని కట్టీ కట్టాని అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారంట.

దీంతో… ఏ లాజిక్ కి అందని విధంగా బాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ వాదన ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విశాఖలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు తనకు ఇచ్చారు.. విశాఖలో తాను పాదయాత్ర చేస్తే వేలాదిగా జనం పాలు పంచుకున్నారు.. అని చెబుతున్న నోటితోనే మీకెందుకు రాజధాని అని బాబు అంటున్నారు. పైగా అది విశాఖ వాసులే అంటున్నారని వారి ముందే చెప్పడం గమనార్హం.

దీంతో ఇప్పటికీ తాను పట్టుకున్న కుందేళుకి మూడేకాళ్లు అనే పద్దతి మరింత ముదరబెట్టుకున్న చంద్రబాబు… ఏకంగా విశాఖ వాసులు కూడా మూడేకాళ్లని చెప్పారని చెప్పారని చెబుతుండటం కొసమెరుపు అనే కామెంట్ళు వినిపిస్తున్నాయి. మరి 2024 ఎన్నికలు సమీపిస్తోన్న వేల విశాఖ ప్రజలు అమరావతే రాజధానిగా కావాలని చంద్రబాబుతో ఏకీభవిస్తారా లేదా అనేది వేచి చూడాలి!