బాబుకి ఇంకా దిగలేదు… దళితులకు మరోసారి అవమానం!

విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీనియారిటీకి ప్రజలు విలువిచ్చి నమ్మడంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విలువనూ, గౌరవాన్ని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ ఒక్క విషయంలోనూ చంద్రబాబు కాపాడుకోలేదని అంటుంటారు. ఇదే సమయంలో… దళితులు, బీసీలపై నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా నాడు బలంగా జరిగింది. దీంతో… 2019లో బాబుని ప్రతిపక్షానికి పరిమితం చేశారు ప్రజానికం!

నాడు దళితులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు… ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని వ్యాఖ్యానించారు! దీంతో.. దళిత సమాజం ఒక్కసారిగా భగ్గుమంది. ఇతర సామాజిక వర్గాలకు చెందిన విజ్ఞులు కూడా కొంతమంది… తాము దళితులుగా పుట్టాలని కోరుకుంటామని చెప్పారు! దళితులుగా పుట్టడానికి గర్వపడతామని.. చంద్రబాబులా పుట్టడానికి మాత్రం అంగీకరించమని మరికొంతమంది వ్యాఖ్యానించారు! దీంతో… దళిత సమాజం టీడీపీకి పూర్తిగా దూరం జరిగినట్లుగా టీడీపీకి 2019 ఫలితాలు వచ్చాయి!

కట్ చేస్తే… మరోసారి ఏపీ రాష్ట్రం ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా… 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఈ సమయంలో… ప్రజాగళం సభల్లో భాగంగా మైకందుకున్న చంద్రబాబు… దళితులపై మరోసారి చిన్నచూపుతో మాట్లాడారు! దళితులంటే చదువుకోనివారన్నట్లుగా వ్యాఖ్యానించారు! దీంతో… బాబుకి ఇంకా దిగినట్లు లేదనే కామెంట్లు ఆ సమాజంలో వినిపిస్తున్నాయి!!

వివరాళ్లోకి వెళ్తే… అనంతపురం జిల్లా శిగమనలలో చంద్రబాబు ఎస్సీలను అవమానిస్తూ మాట్లాడారు! వెకిలి నవ్వులు నవ్వుతూ నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారని అంటున్నారు! ఇందులో భాగంగా… శింగనమల వైసీపీ అభ్యర్థి మన్నెపాక వీరాంజనేయులును అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌ అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సమయంలో ఒక టిప్పర్‌ డ్రైవర్‌ కు అసెంబ్లీ టికెట్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తుంటే.. “ఎమ్మెల్యే పద్మావతికి కాకుండా ఆమె భర్తకు కాకుండా వాళ్ల టిప్పర్‌ డ్రైవర్‌ కు టికెట్‌ ఇచ్చారు. ఎడమచేతి వేలిముద్ర వేయించుకోవడానికి టిప్పర్‌ డ్రైవర్‌ కు టికెట్‌ ఇచ్చాడు. గొప్పోడయ్యా… తప్పకుండా అభినందించాల్సిందే.. ఆయన తెలివితేటలకు ధన్యవాదాలు.. శభాష్‌!” అంటూ బాబు వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

దీంతో… పేదలను, దళితులను చంద్రబాబు ఎంత చిన్నచూపు చూస్తారనే విషయం మరోసారి బయటపడింది! దీంతో… దళితులను చంద్రబాబు చిన్నచూపు చూడటంపట్ల జగన్ తనదైన శైలిలో ఫైరయ్యారు. వీరాంజనేయులు ఎంత చదువుకున్నదీ, ఎందుకు టిప్పర్ డ్రైవర్ గా పనిచేసుకోవాల్సి వచ్చిందీ సవివరంగా ప్రజానికానికి వివరించారు. దీంతో… ఈసారి ఒక్క దళిత ఓటు కూడా టీడీపీకి పడే అవకాశాలు లేవనే చర్చ ఆ సామాజికవర్గ ప్రజానికంలో మొదలైందని అంటున్నారు!

ఇదే సమయంలో… ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వీరాంజనేయులు ఎంఏ, బీఈడీ చేశారు.. అంటే… చంద్రబాబు కంటే ఎక్కువ చదువుకున్నారు. అయితే… ఈ విషయం తెలుసుకోలేని అజ్ఞానం బాబు సొంతం అని ఫైరవుతున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాక, టిప్పర్‌ డ్రైవర్‌ గా జీవనం సాగిస్తున్నారు.. అందుకు చంద్రబాబే సిగ్గుపడాలి.. ఉన్నత చదువులు చదివి, కష్టించి పని చేసుకుంటున్న వీరాంజనేయులును చట్ట సభలకు పంపాలన్న ఉన్నత లక్ష్యంతో సీఎం జగన్‌.. శింగనమల టికెట్‌ ఇచ్చారు అని స్పష్టం చేస్తున్నారు.

దీంతో ఈ వెటకారం వల్ల చంద్రబాబుకు 2019 తరహాలోనే అతిపెద్ద డ్యామేజ్ జరిగే ప్రమాదం పుష్కలంగా ఉందని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. మరి ఈ డ్యామేజ్ ని చంద్రబాబు ఎలా కవర్ చేసుకుంటారనేది వేచి చూడాలి!!