ఖైదీ నెంబర్ 7691… 7+9+6+1 = 23!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబడ్డ సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకూ చంద్రబాబు ఇంటినుంచి పంపించే భోజనం తింటూ, టై ప్రకారం మెడిసిన్స్ వేసుకుంటూ జైలు జీవితం గడపాల్సి వస్తోంది! ఆ సంగతి అలా ఉంటే… బాబు అరెస్టుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటంపై టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నాయి. ఈ సమయంలో పోలీసులు కూడా అదేస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఆందోళన కారులను ఎక్కడికక్కడ అరెట్ చేసి పీఎస్ లకు తరలిస్తున్నారు.

నిరసనలు అలా ఉంటే… బాబు జైలు కి వెళ్లడంపై వైసీపీ నేతలతో పాటు నెటిజన్లు తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేస్తున్నారు. చంద్రబాబును అవినీతి చక్రవర్తి అని సంభోదించిన ఎన్టీఆర్ ఆత్మ ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ వేదికగా తమ క్రికేటివిటీ చూపిస్తున్నారు నెటిజన్లు.

ఇందులో భాగంగా చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో ఒక ప్రత్యేక గదిని కేటాయించి… ఖైదీ నెంబర్ కేటాయించారు. ఆ నెంబర్ 7961 కాగా… ఆ నాలుగు నెంబర్ ని కలిపి, టోటల్ 23 వచ్చిందంటూ నెటిజన్ లు ర్యాగింగ్ చేస్తున్నారు. కారణం… 23 అనేది 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫేమస్ నెంబర్ అయిన సంగతి తెలిసిందే.

2014 ఎన్నికల అనంతరం గోడ దూకుడులనూ ప్రోత్సహించిన చంద్రబాబు… వైసీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా టీడీపీలో కండువాలు కప్పి చేర్చుకున్నారు. ఈ చర్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 23 సీట్లు టీడీపీ గెలుచుకుంది.

ఈ విషయాన్ని ఎన్నికలు అయిన అనంతరం అసెంబ్లీలో వైసీపీ నేతలు ప్రస్థావిస్తూ… బాబు ని తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేశారు. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు లో బాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్ లోని నాలుగు నెంబర్స్ ని కలిపి 23 వచ్చిందంటూ ర్యాగింగ్ చేస్తున్నారు నెటిజన్లు! పైన భగవంతుడు ఉన్నాడంటూ కామెంట్లు పెడుతుండటం గమనార్హం.