నిరుద్యోగ భృతిలో చంద్రబాబు తాజా  మోసం

నిరుద్యోగులను మోసం చేయటంలో చంద్రబాబునాయుడు ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదు. దరఖాస్తుల్లో సాంకేతిక కారణాలతో నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి పథకాన్ని నీరుగార్చాలని ప్లాన్ వేస్తున్నట్లు అనుమానంగా ఉంది. ప్రభుత్వం తాజాగా వేసిన ప్లాన్ తో లక్షలాదిమంది నిరుద్యోగులు మళ్ళీ మోసానికి గురవ్వటం ఖాయంగా తెలుస్తోంది. పోయిన ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇచ్చిన హామీకి పాతరేయటంలో చంద్రబాబుకు మించిన వాడు ఇంకోరు ఉండరు.

 

అదే పద్దతిలో నాలుగున్నరేళ్ళుగా భృతి పేరుతో నిరుద్యుగులను  నిలువునా ముంచాడు. సరే ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో తప్పదని భృతి విషయంలో ఓ ప్రకటన చేశారు.  ఈనెల నుండే భృతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గ విధి విధానాలను కూడా ప్రకటించింది. దరఖాస్తులను ఆహ్వినించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే భృతి అందుకోవాల్సిన వాళ్ళ సంఖ్య సుమారు 10 లక్షలని తేలింది.  మొత్తానికి భృతి అందుకునేందుకు దరఖాస్తులను నింపమని చెప్పింది ప్రభుత్వం. అయితే ఇక్కడే ప్రభుత్వం తన చావు తెలివితేటలను ప్రదర్శించింది.

 

నిరుద్యోగులు భర్తీ  చేయాల్సిన దరఖాస్తులో ‘ గివ్ అప్ ‘ అనే ఆప్షన్ కూడా పెట్టారట. గివ్ అప్ అంటే ఏమిటో అర్ధంకాని చాలా మంది ఆ ఆప్షన్ కు  కూడా టిక్ పెట్టారట. గివ్ అప్ అంటే స్వచ్చంధంగా వదులుకోవటం. నింపే దరఖాస్తే భృతి కోసం. అటువంటిది దరఖాస్తును భర్తీ చేసే సమయంలో గివ్ అప్ కు నిరుద్యోగులు ఎందుకు ఆప్షన్ పెడతారు ? అసలు నిరుద్యోగ భృతి అవసరం లేదనుకునే వారు దరఖస్తును ఎందుకు ఓపెన్ చేస్తారు ? ఎందుకు భర్తీ చేస్తారు ? ఇంత చిన్న విషయం కూడా ఉన్నతాధికారులకు తెలీదా ?

 

తెలీక కాదు  ఆ ఆప్షన్ పెట్టింది. అన్నీ ఖాళీలు భర్తీ చేయాలన్న తొందరలో ఎవరైనా ఆ ఆప్షన్ కూడా టిక్ పెడితే అంతే సంగతులు. తమంతట తాముగా నిరుద్యోగ భృతిని వదులుకున్న కారణంగా వారికిక నిరుద్యోగ భృతి రాదు. జరిగిన పొరబాటును అర్ధం చేసుకుని మళ్ళీ దరఖాస్తును సక్రమంగా నింపాలంటే వాళ్ళకు అప్లికేషన్ ఓపెన్ కావటం లేదు. దాంతో లక్షలాది మంది నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇదంతా చంద్రబాబుకు తెలీకుండానే జరిగుంటుందా ? చాన్సే లేదు. కేవలం నిరుద్యోగులను ఇబ్బంది పెట్టటానికి పెట్టిన అతితెలివి ఆప్షనే అది.  చూశారుగా, ఎంత తెలివిగా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందో ?