చంద్రబాబుకు గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి.. అందరికీ ఫోన్లు 

Chandrababu alerts party leaders
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టత వచ్చేసింది.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అత్యున్నత న్యాయయస్థానం తీర్పునిచ్చింది.  రాజ్యాంగ సంస్థలు వాటి పని అవి చేస్తాయని, ఎన్నికల విషయంలో కోర్టులు కలుగజేసుకోవని తేల్చి చెప్పింది.  పనిలో పనిగా ఎన్నికలు వద్దన్న వారివుకి తలంటింది.  సుప్రీం తీర్పుతో తెలుగుదేశం నేతల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.  వైఎస్ జగన్ మీద పైచేయి సాధించామని ఆనందంలో ఉన్నారు.  నిమ్మగడ్డ విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  ఇలా టీడీపీ నేతలంతా హడావుడిలో ఉంటే అధినేత చంద్రబాబు నాయుడు గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయట. 
 
Chandrababu alerts party leaders
Chandrababu alerts party leaders
అనుకున్నట్టే ఎన్నికల సంఘం వాదన నెగ్గింది.  ఎన్నికలకు ఇకపై ఎలాంటి ఆటంకాలు ఉండవు.  ప్రభుత్వం కూడ సుప్రీం కోర్టు తీర్పును శిరసా వహిస్తామని స్పష్టం చేసింది.  ఇక మిగిలిందల్లా ఎన్నికలు జరగడమే.  అయితే ఇన్నిరోజులు ఎన్నికల కోసం ఇంతలా తపించిన టీడీపీకి ఎన్నికల్లో వైసీపీని ఓడించే శక్తి ఉందా అంటే డౌటే.  ఇదే సందేహం ఇప్పుడు చంద్రబాబుది.  పంచాయతీ ఎన్నికలంటే క్షేత్ర స్థాయిలో బలాలకు అగ్ని పరీక్ష వంటిది.  పార్టీ మూలాలు ఎంత బలంగా ఉన్నాయో రుజువుచేసే ఎన్నికలు ఇవి.  ప్రధానంగా ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే గ్రామీణ ఓటర్ల మనస్తత్వాన్ని అడ్డం పడతాయి.  స్థానిక ఎన్నికలో బంఫర్ మెజారిటీ కొడితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు మార్గం సుగమం అయినట్టే. 
 
తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సంస్థాగతంగా బలమైన పార్టీయే.  వారికి పర్మినెంట్ ఓటు బ్యాంక్ ఒకటుంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినంత ఘోరంగా అయితే ఓడిపోరు.  అది ఖాయం.  కానీ వైసీపీని పూర్తిగా మట్టికరిపిస్తామనే సవాళ్లు చేసి ఉన్నారు చంద్రబాబు.  అదేమంత ఈజీ అయిన పని కాదు.  జగన్ అధికారంలో ఉన్నారు.  సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలుచేస్తున్నారు.  వైఫల్యాల ప్రభావం కిందిస్థాయి వరకూ వెళ్లిందో లేదో చెప్పడం అసాధ్యం.  తక్కువ అంచనా వేయడం మంచిది కాదు.  అందుకే బాబుగారు వరుసపెట్టి అన్ని జిల్లాల నేతలకు ఫోన్లు చేస్తున్నారట.  జిల్లా స్థాయి నుండి వార్డు స్థాయి వరకు అందరినీ లైన్లోకి తీసుకోమని నాయకులకు చెబుతున్నారట. 
 
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడవకూడదని, వైకాపాను ఎన్ని విధాలుగా దెబ్బకొట్టవొచ్చో అన్ని విధాలుగా దెబ్బతీయాలని, ప్రజల్లోకి సమస్యలను బలంగా తీసుకెళ్లి ప్రభుత్వం ఈ రేండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదనేది స్పష్టంగా చూపించాలని, ఇవి సెమీ ఫైనల్ లాంటివని చెబుతున్నారట. కొత్తగా పదవులు పొందిన నాయకులు, ఎమ్మెల్యేలు కూడ బాబుగారి మాటలను సీరియస్ గా తీసుకుని రంగంలోకి దూకేందుకు సిద్దమయ్యారట.