అబ్బో… ప్లాన్ బానే ఉంది బాబు గారు , జగన్ మీ ఎత్తుకి పై ఎత్తు వేయలేడు అంటారా ?

chandra babu waiting for right time to get back voters

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు, ప్రత్యేక ఆంధ్రలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు రాజకీయ చతురత మాములుగా ఉండదు. ఏదైనా ఒక అంశం మీద ఆయన స్కెచ్‌ వేస్తే దాన్ని విజయపు అంచులదాకా తీసుకెళ్లదాకా ఊరుకోరు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు తనదైన ముద్రతో ప్రత్యేకత చాటుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేస్తున్న కొన్ని పనులను చూసి వామ్మో.. అనక తప్పడం లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బాబు అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరుగా ఏర్పడ్డ రాష్ట్రంలో మొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన అక్కడి నుంచే పాలన మొదలుపెట్టాడు. పరిపాలనకు సంబంధించిన భవనాలు, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి ఐదేళ్లలో తాననుకున్న పనులన్నీ చేశాడు. అయితే పోలవరం లాంటి ప్రాజెక్టులను కేంద్రంతో ముడిపెడుతూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రాజధానికి కావాల్సిన ఏర్పాట్లను అన్నీ చేశాడు.

chandra babu waiting for right time to get back voters
chzndra babu naidu

2019 ఎన్నికల్లో బాబుకు పరిస్థితులు బెడిసికొట్టి ఓటమి చెందారు. అయినా అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఏదో రకంగా మెలికలు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చట్టం చేశారు. అమరావతి, విశాఖ, కర్నూలు జిల్లాలో రాజధానులు ఉంటాయని ప్రకటించారు. అయితే ప్రకటించడమే గానీ ఇంతరవకు కార్యరూపం దాల్చలేదు. అయితే చంద్రబాబు మాత్రం అమరావతి రైతులతో పోరాడిస్తూనే ఉన్నారు. అమరావతి రాజధానిని విడిచిపెట్టేది లేదని, తాను ఏర్పరుచుకున్న రాజధానిని ఎలా మారుస్తారని పట్టుబడుతున్నాడు.

మరోవైపు అమరావతిపై సీఐడీ ఎంక్వైరీ అంటూ జగన్‌ విచారణకు కోరుతూ బాబు కుంభకోణాలపై బయటపెడుతానంటున్నాడు. కానీ చంద్రబాబు మాత్రం కోర్టును నమ్ముకున్నారు. జగన్‌కు అటు సంక్షేమ పథకాల్లోనూ అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు అభివృద్ధి విషయంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదంటూ టీడీపీ నాయకులు మెల్లగా ఆధారాలు వెతుకుతున్నారు. ఇక అక్రమాస్తుల కేసులో ఇరుక్కున జగన్‌.. ప్రజాప్రతినిధులపై కేసులు సత్వరమే చర్యలుంటాయని కేంద్రం గంట కొట్టడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తున్న చంద్రబాబు ఓపికపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆడంబారాలే తప్ప జగన్‌ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందేమి లేదని ప్రచారం చేస్తున్నాడు. అయితే జగన్‌ ఇలా అభివృద్ధిని పక్కనబెట్టి అమరావతిపైనే ఫోకస్‌ పెడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీ పటిష్టంగా మారి వైసీపీ బలహీనంగా మారుతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. దీంతో బాబు వచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదీ.. అని ప్రజలను రెచ్చగొడితే మాత్రం వైసీపీకి ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏదీ ఏమైనా చంద్రబాబు వేసే రాజకీయ వలలో జగన్‌ చిక్కుతాడా..? లేదా..? అన్నది చూడాలి..