ష్లాష్ న్యూస్… హైకోర్టు విభజన పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది.
జనవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణకు , ఆంధ్రప్రదేశ్ కు వేర్వేరు హైకోర్టులు పని చేయనున్నాయి.
తెలంగాణకు పది మంది జడ్జీలు, ఆంధ్రప్రదేశ్ కు 16 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్రం నోటిఫికేషన్లో వెలువరించింది.
హైకోర్టు విభజన విషయంలో టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సర్కారు గడిచిన నాలుగేళ్లలో అనేకసార్లు కేంద్రంపై వత్తిడి తెచ్చింది. పలు సందర్భాల్లో దీనిపై పలు వేదికలపైన తెలంగాణ సర్కారు పోరాటం చేసింది.
అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఉంటుంది కాబట్టి హైకోర్టు విభజన విషయంలో ఎపి సర్కారు కానీ, ఎపి సిఎం కానీ పాజిటీవ్ గా స్పందించలేదని తెలంగాణ సర్కారు ఆరోపిస్తూ వచ్చింది. దీంతోపాటు ఇటీవల కాలం వరకు టిడిపి, బిజెపి పార్టీలు పొత్తులో ఉన్నాయి. దీంతో కేంద్రం హైకోర్టు విభజనలో ఆలస్యం చేసిందన్న విమర్శలు టిఆర్ఎస్ చేస్తూ వచ్చింది.
ఇక అమరావతిలో హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏప్రిల్ నుంచి అమరావతి నుంచే హైకోర్టు పనిచేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. కానీ టిఆర్ఎస్ కేంద్రం పూ పదే పదే వత్తిడి తెచ్చిన కారణంగా కేంద్రం ఈమేరకు బుధవారం నోటిఫికేసన్ జారీ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసిఆర్ సమావేశం అయిన మరుక్షణమే హైకోర్టు విభజన నోటిఫికేషన్ రావడం పట్ల తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం నాన్చిన కేంద్ర సర్కారు ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వ ఆవేదన ను అర్థం చేసుకుందని వారు అంటున్నారు.
అయితే ఎపి హైకోర్టు ఏప్రిల్ వరకు హైదరాబాద్ లోనే కొనసాగుతుందా? లేదంటే ఇమిడియేట్ గా ఇక్కడి నుంచి తరలిపోతుందా అన్నది తేలాలి. అయితే ఎపి సర్కారు కోరితే ఎపి హైకోర్టు కు తాత్కాలిక భవనాలు కేటాయించేందుకు తమకు సమ్మతమే అని తెలంగాణ సర్కారు గతం నుంచీ చెబుతూ వస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడిన న్యాయమూర్తులు…
జస్టిస్ రమేష్ రంగనాథన్
జస్టిస్ సి ప్రవీణ్ కుమార్
జస్టిస్ వెంకట నారాయణ
జస్టిస్ వెంకట శేషసాయి
జస్టిస్ దామ శేషాద్రి నాయుడు
జస్టిస్ సీతారామమూర్తి
జస్టిస్ దుర్గా ప్రసాద రావు
జస్టిస్ టి సునీల్ చౌదరి
జస్టిస్ ఎం సత్యానారాయణ మూర్తి
జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్
జస్టిస్ ఉమాదేవి
జస్టిస్ ఎస్ బాలయోగి
జస్టిస్ విజయలక్ష్మి
జస్టిస్ రజిని
జస్టిస్ సోమయాజులు
తెలంగాణకు కేటాయించబడిన న్యాయమూర్తులు :
జస్టిస్ వెంకట సంజయ్ కుమార్
జస్టిస్ రాంచందర్ రావు
జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి
జస్టిస్ పి.నవీన్ రావు
జస్టిస్ కోదండరాం చౌదరి
జస్టిస్ బి శివశంకర్ రావు
జస్టిస్ శమీమ్ అక్తర్
జస్టిస్ పి.కేశవ రావు
జస్టిస్ అభినంద్ కుమార్ షావిలై
జస్టిస్ అమరనాథ్ గౌడ్
హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ కింద ఉంది చూడొచ్చు.