ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే , ప్రభుత్వం కోరినట్టు స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
కరోనా వల్ల ఇప్పటికే అనేకమంది మరణించారని పిటిషనర్ ప్రస్తావించగా, వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్ ఈ సీ కౌంటర్ ఇచ్చింది. వైద్యశాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎస్ ఈసీ చెప్పుకురాగా, సుప్రీం ఆదేశాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ పై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.
2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. దీనిపై వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఎన్నికల సంఘం న్యాయవాది అశ్విన్ కుమార్ తిప్పికొట్టారు. ఇప్పటికే మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం సంప్రదించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. నిజంగా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు.