ఫలితాలు వెలువడుతున్న గురువారం సుమారు 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున అల్లర్లు జరగబోతున్నట్లు కేంద్ర హోం శాఖ అప్రమత్తత ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమీషన్ కు ముందుగాను హెచ్చరికలు జారీ చేసింది. అందుకనే కేంద్ర నుండి అదనపు బలగాలను రాష్ట్రానికి పంపింది.
తెలుగుదేశంపార్టీ ఓడిపోతోంది అనుకున్నపుడు కౌంటింగ్ కేంద్రాల్లోనే టిడిపి తరపున కౌంటింగ్ ఏజెంట్లు గొడవలు పెట్టుకోవాలని స్వయంగా శిక్షణా తరగతుల్లో పదే పదే చెప్పిన విషయం బయటపడింది. దాంతో విషయం బయటకు పొక్కగానే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్ర హోంశాఖను అప్రమత్తం చేసింది. దాంతో హోంశాఖ వెంటనే అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాని హెచ్చరించింది.
సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరికల ప్రకారం 13 జిల్లాల్లోని 55 నియోజకవర్గాల్లో అల్లర్లకు ఎక్కువగా అవకాశం ఉందట. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, రాప్తాడు, హిందుపురం, పెనుగొండ, ఉరవకొండ ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, బనగానపల్లె, ఆదోని, డోన్, పత్తికొండ, కడప జిల్లాలోని జమ్మలమడుగు, కడప, మైదుకూరు, రైల్వేకోడూరు, బద్వేలు ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లి, శ్రీకాళహస్తి, పలమనేరు, చంద్రగిరి, తిరుపతి, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కొవ్వూరు, ప్రకాశం జిల్లాలోని చీరాల, అద్దంకి, కొండెపి, కనిగిరి ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, మంగళగిరి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట ఉంది. కృష్ణా జిల్లాలోని మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, గుడివాడ ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, దెందులూరు, ఏలూరు, ఆచంట. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్, అమలాపురం, విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ, గాజువాక, పెందుర్తి ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, ఆముదాలవలస లో అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు చేయటం గమనార్హం.